నేడు కేసీఆర్ ప్రచార షెడ్యూల్ ఇదే..

nanireddy
Updated on: 24 Dec 2018 4:22 PM IST
నేడు కేసీఆర్ ప్రచార షెడ్యూల్ ఇదే..
X

పోలింగ్ సమయం సమీపిస్తున్న కొద్ది రాజకీయ పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, తెరాస అధ్యక్షుడు కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభలతో సుడిగాలి పర్యటనలు చేస్తూ.. జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. కేసీఆర్ ఈరోజు ఆరు సభల్లో పాల్గొననున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు సత్తుపల్లి, ఒంటిగంటకు మధిర, 1.45 గంలలకు కోదాడ, మధ్యాహ్నం 2.30 గంటలకు హుజూర్‌నగర్‌, 3.30 గంటలకు మిర్యాలగూడలో కేసీఆర్ సభలు జరుగనున్నాయి. అలాగే సాయంత్రం 4.30 గంటలకు నల్గొండలో నిర్వహించనున్న బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొంటున్నారు. ఇదిలావుంటే నిన్న తమ ఎలక్షన్ మేనిఫెస్టో విడుదల చేశారాయన.. మేనిఫెస్టోలోని అంశాలను ఇవాల్టినుంచి ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు. ఇప్పటికే అభ్యర్థులందరికీ మేనిఫెస్టో కాపీలు అందాయి. మేనిఫెస్టోలోని అంశాల గురించి ప్రతి ఇంటికి వివరించాలని కేసీఆర్ అభ్యర్థులకు సూచించారు.

nanireddy

nanireddy

Next Story