17 సీట్లకు పట్టుబడుతున్న టీజేఎస్...లేకుంటే కూటమి నుంచి....

x
Highlights

కేసీఆర్‌ ను ఓడించడమే లక్ష్యంగా ఒక్కటైన కూటమిలో తలెత్తిన విభేదాలను పరిష్కరించే పనిలో పడింది టీ కాంగ్రెస్‌. అధిష్టానం ఆదేశంతో టీజేఎస్‌ నాయకులను...

కేసీఆర్‌ ను ఓడించడమే లక్ష్యంగా ఒక్కటైన కూటమిలో తలెత్తిన విభేదాలను పరిష్కరించే పనిలో పడింది టీ కాంగ్రెస్‌. అధిష్టానం ఆదేశంతో టీజేఎస్‌ నాయకులను బుజ్జగించే పనిలో పడ్డారు. ఈ మధ్య కూటమి సమావేశాలకు గైర్హాజరవుతున్న కోదండరామ్‌తో మాట్లాడేందుకు తెలంగాణ కాంగ్రెస్‌ నాయకులు సంప్రదింపులు జరుపుతున్నారు. అయితే టీ కాంగ్రెస్‌ నాయకులకు కోదండరామ్‌ అందుబాటులోకి రావడం లేదు. ఢిల్లీలో ఉన్న టీజేఎస్‌ నాయకులతో చర్చించేందుకు కొప్పుల రాజు ప్రయత్నిస్తున్నారు. అయితే తమకు 17 స్థానాలిస్తేనే పొత్తుకు అంగీకరిస్తామని బెట్టు చేస్తున్నారు. అంతకంటే తక్కువిస్తే మాత్రం కూటమి నుంచి వైదొలుగుతామంటూ వార్నింగ్‌ ఇస్తున్నట్లు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories