చందానగర్‌‌లో ట్రిపుల్‌ మర్డర్‌

చందానగర్‌‌లో ట్రిపుల్‌ మర్డర్‌
x
Highlights

హైదరాబాద్‌ చందానగర్‌‌లో దారుణం జరిగింది. వేముకుంటలో ముగ్గురు దారుణ హత్యకు గురయ్యారు. తల్లీకూతురుతోపాటు ఓ చిన్నారికి ఇనుప రాడ్డుతో కొట్టిచంపారు....

హైదరాబాద్‌ చందానగర్‌‌లో దారుణం జరిగింది. వేముకుంటలో ముగ్గురు దారుణ హత్యకు గురయ్యారు. తల్లీకూతురుతోపాటు ఓ చిన్నారికి ఇనుప రాడ్డుతో కొట్టిచంపారు. శనివారం రాత్రి ఈ మర్డర్స్‌ జరిగినట్లు ప్రాథమిక అంచనాకు వచ్చిన పోలీసులు తెలిసినవాళ్ల పనిగా అనుమానిస్తున్నారు. మృతులు అపర్ణ, అమె తల్లి విజయలక్ష్మి, అపర్ణ కుమార్తె కార్తికేయిని ఉన్నారు. అపర్ణ ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తుంది. విధులకు రాకపోవడంతో తోటి సిబ్బంది అపర్ణ ఇంటికి వెళ్లారు. తలుపులు తెరవకపోవడంతో కిటికి నుంచి చూసి చనిపోయినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఘటనా స్థలాన్ని మాదాపూర్ డీసీపీ విశ్వప్రసాద్, ఏసీపీ భుజంగరావు, ఇన్‌స్పెక్టర్‌లు తిరుపతిరావు, హరిశ్చంద్రారెడ్డి పరిశీలించారు. మృతులు భీమవరం వాసులుగా గుర్తించారు. అపర్ణ 10 సంవత్సరాల క్రితం నగరానికి వచ్చింది. కూకట్ పల్లిలో నివాసం ఉంటున్న పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన మధు అనే వ్యక్తిని ప్రేమించి 10 సంవత్సరాల క్రితం వివాహం చేసుకుంది. పాప పుట్టిన అనంతరం మధుకు అంతకు ముందే వివాహం అయ్యిందని తెలిసి ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఎనిమిది సంవత్సరాల నుంచి అపర్ణ మధులు దూరంగా ఉంటున్నారు. మోబైల్ షాప్ నిర్వహకుడు రూప్‌లాల్ అనే వ్యక్తితో ప్రస్తుతం అపర్ణ ప్రేమలో ఉన్నట్లు స్థానికుల సమాచారం.

అపర్ణను బలమైన కర్ర లేదా రాడ్ తో కొట్టడంతో మృతి చెందినట్లు గుర్తించారు. హత్య జరిగినట్లు గుర్తించిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పోలీసులు, స్థానికులు మధు, రూప్‌లాల్ ల పైనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రెండు రోజుల క్రితం మృతి చెందడంతో మృతదేహాలు కొద్దిగా కుళ్లినట్లు పోలీసులు తెలిపారు. అపర్ణ భర్త మధు, ప్రియుడు రూప్‌లాల్ కోసం కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories