అమరావతిలో ఎయిర్ షో ...విమానాలు చేస్తున్నఅద్భుత విన్యాసాలకు ఫిదా అయిపోయిన ప్రజలు

x
Highlights

కనురెప్ప వేయలేరు.. ఊపిరి పీల్చుకోవడం కూడా మర్చిపోతారు.. అమరావతిలో కృష్ణానదిపై.. ఏపీ పర్యాటకశాఖ ఏర్పాటు చేసిన ఎయిర్ షో చూస్తుంటే.. ఇదే ఫీలింగ్...

కనురెప్ప వేయలేరు.. ఊపిరి పీల్చుకోవడం కూడా మర్చిపోతారు.. అమరావతిలో కృష్ణానదిపై.. ఏపీ పర్యాటకశాఖ ఏర్పాటు చేసిన ఎయిర్ షో చూస్తుంటే.. ఇదే ఫీలింగ్ రాకమానదు.. రైయ్ మంటూ గాల్లో చక్కర్లు కొడుతున్న విమానాలు వీక్షకులను కట్టిపడేస్తున్నాయి. ఏపీ రాజధాని అమరావతిలో మూడు రోజులపాటు జరిగే ఎయిర్ షో లు ప్రారభమయ్యాయి కృష్ణానది, ప్రకాశం బ్యారేజీ ఎగువన ఎన్టీఆర్ సాగర్‌ వేదికగా ఏపీ టూరిజం శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతోంది. ఇందులో భాగంగా తొలిరోజైన శుక్రవారం ఎయిర్ క్రాఫ్ట్ విన్యాసాలు చూసేందుకు భారీగా ప్రజలు కృష్ణా తీరానికి చేరుకున్నారు విమానాలు గంటకు 250 నుంచి 450 కిలోమీటర్లు వేగంతో దూసుకు పోతూ చేస్తున్న విన్యాసాలు చూపరులను కట్టిపడేశాయి.

ఏపీ టూరిజం శాఖ అమరావతి ఎయిర్ షో 2018 పేరట ఈ విన్యాసాలను ఏర్పాటు చేసింది దీనికోసం గ్లోబల్ స్టార్స్ టీమ్‌తో ఒప్పందం చేసుకుంది ఏరో బాటిక్ ప్లయింగ్ డిస్ ప్లేలో విన్యాసాలు చేయడంలో గుర్తింపు ఉన్న మార్క్ జెఫ్రీన్ సారధ్యంలో టామ్ క్యాసెల్స్, క్రిస్ బర్కెట్ స్టీవ్ కార్వర్ లు ప్రత్యేక ప్రదర్శనలు చేస్తున్నారు. మూడు రోజుల పాటు జరిగే ఎయిర్‌ షో కార్యక్రమంలో తొలిరోజు రాష్ట్రమంత్రులు కొల్లు రవీంద్ర, నక్కా ఆనందబాబు ప్రారంభించారు ఇలాంటి కార్యక్రమాల వళ్ల అమరావతికి ప్రపంచ స్థాయి గుర్తింపు వస్తుందని మంత్రులు అభిప్రాయ పడ్డారు. ఇక శని, ఆది వారాల్లో కూడా ఉదయం 11 గంటల నుంచి 11 గంటల 15 నిమిషాల వరకు, మళ్లీ సాయంత్రం 4 నుంచి 4.15 నిమిషాల వరకూ ఎయిర్ షో నిర్వహిస్తారు పదిహేను నిమిషాలలో ఏడు అద్బుతమైన విన్యాసాలు చేస్తారు వీటిని వీక్షించేందుకు విజయవాడ సిటీతో పాటుగా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పెద్దఎత్తున వీక్షకులు వస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories