logo

పిల్లనిచ్చిన అత్తారింటికే కన్నం వేసిన అల్లుడు

పిల్లనిచ్చిన అత్తారింటికే కన్నం వేసిన అల్లుడు
Highlights

అప్పులు చేసాడు. అప్పుల తిప్పలు తప్పించుకునేందుకు అత్తింటికే కన్నం వేసాడు. పోలీసులకు దొరక్కుండా సినీఫక్కీలో...

అప్పులు చేసాడు. అప్పుల తిప్పలు తప్పించుకునేందుకు అత్తింటికే కన్నం వేసాడు. పోలీసులకు దొరక్కుండా సినీఫక్కీలో తప్పుదోవ పట్టించ్చాడు. సీసీ కెమెరాలు ఆ ఇంటిదొంగను పట్టించాయి. గత నెల 30న హైదరాబాద్ ఎస్సార్ నగర్‌లో జరిగిన ఓ చోరీ కేసులో దొంగల్లుడిని అరెస్ట్ చేసిన పోలీసులు లక్ష రూపాయల నగదు 12 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.

ఇక్కడ బ్లాక్ ముసుగులో కనిపిస్తున్న ఇతగాడి పేరు హార్రీ ఆంథోని. ముషీరాబాద్ హరిరామ్ నగర్ లో నివాసం ఉంటున్నాడు. ఎస్సార్ నగర్ తులసీ నగర్ లో ఉంటున్న బీ.ఆంథోని కూతురును హర్రీ ఆంథోనిని ప్రేమించి పెళ్ళి చేసుకున్నాడు. నవంబర్ లో భార్యతో కలిసి అమెరికా వెళ్ళిన బీ.ఆంథోని ఇంటి భాద్యతలు తన తల్లితో పాటు అల్లుడు హర్రీ ఆంథోనికి అప్పగించి వెళ్ళాడు. మామ ఇంట్లో ఉన్న బంగారం క్యాష్ పై అప్పటికే కన్నేసిన ఆంథోని ఇదే అదునుగా అత్తింట్లో చోరీకి ప్లాన్ చేసాడు. అందుకోసం గత నెల 30వ తేదీ నైట్ దోపిడికి ముహుర్తం పెట్టుకున్నాడు. ఎలాగో సిటీలో సంక్రాంతి దొంగలు పడే ఛాన్స్ ను ఆసరాగా తీసుకుని పక్కా స్కెచ్ వేసి మామ ఇంటిని లూఠీ చేసాడు.

ఇలా తన ప్లాన్ లో భాగంగా ఇంటి కిటికీల గ్రిల్స్ ను తొలగించి ఇంట్లోకి ప్రవేశించిన ఆంథోని.. బెడ్ రూమ్ లో ఉన్న 18 తులాల బంగారు ఆభరణాలు 2లక్షల 50వేల నగదును దొంగిలించాడు. దీంతో పాటు తనను గుర్తించకుండా ఇంట్లో ఉన్న మామగారి తల్లి అనంతమ్మపై దాడి చేసాడు. దీంతో పాటు డాగ్ స్క్వాడ్‌కు కాని పోలీసుల క్లూస్ టీమ్స్ కానీ తన ఆనవాళ్ళు దొర్కకుండా ఇంటి నిండా కారంపొడి చల్లి ఎస్కేప్ అయ్యాడు.

ఇలా ఎవరీ అనుమానం రాకుండా తన ప్లాన్‌ను పక్కాగా అమలు చేసిన అల్లుడు ఆంథోని....పోలీసులను కూడా తప్పుదోవ పట్టించాడు. ఐతే మొదటి నుండి ఆంథోని పై అనుమానం వ్యక్తం చేస్తున్న పోలీసులు...చోరి జరిగిన ఇంటి నుండి ఎస్సార్ నగర్ తో పాటు ముషీరాబాద్ వరకు 70 సీసీ కెమెరా ఫుటేజ్ లను పరిశీలించారు. ఐతే చోరి జరిగిన టైమ్ నుండి ఈ అన్ని సీసీ ఫుటేజ్‌ల్లో ఆంథోని మూవ్ మెంట్స్ ఉండడంతో...ఇంటి అల్లుడే దొంగని నిర్ధారణకు వచ్చారు. పిల్లనిచ్చిన అత్తింటికే కన్నం వేసి తప్పించుకుందామనుకున్న దొంగల్లున్ని...సీసీ కెమెరాలే పట్టించాయి. అందుకే పోలీసులు ప్రతి ఒక్కరూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.

లైవ్ టీవి

Share it
Top