పడిలేచిన కెరటం సెంచరీ కొట్టేసింది..

nanireddy
Updated on: 24 Dec 2018 3:45 PM IST
పడిలేచిన కెరటం సెంచరీ కొట్టేసింది..
X

'బాయ్స్' సినిమాలో డ్రమ్స్ వాయిస్తూ స్నేహితులను ఉత్తేజపరిచే కుర్రాడిని చూసి అతను పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అవుతాడని ఎవరైనా ఊహించి ఉంటారా.? కెరీర్ ప్రారంభించిన పదేళ్లలోనే 100 సినిమాలకు సంగీతం సమకూర్చుతాడని అనుకుంటారా..? బహుశా అనుకోవచ్చు.. సినీ ప్రేక్షకులకు ఆయన నటుడిగా పరిచయమైనా.. అయన మనసంతా సంగీతం వైపే ఉంది. ఎంతో మంది దిగ్గజ సంగీత దర్శకుల వద్ద పనిచేసిన అనుభవంతో మ్యూజిక్ డైరెక్టర్‌గా మారిన థమన్ తన సంగీతంతో తెలుగు, తమిళ ప్రేక్షకులను మైమరిపింపజేశాడు. వెరైటీ మ్యూజిక్ ముద్రతో దూసుకెళుతూ.. పడిలేచిన సంగీత కెరటంలా దూసుకుపోతున్నాడు.

ఇటీవల ఎన్టీఆర్ హీరోగా వచ్చిన ‘అరవింద సమేత’కు మ్యూజిక్ అందించి భారీ హిట్ ను అందుకున్నాడు థమన్. అలాగే వంద సినిమాలకు మ్యూజిక్ అందించిన రికార్డు కూడా ఈ సినిమాతోనే క్రియేట్ చేశాడు. కాగా అరవింద సమేత సూపర్ హిట్ అవ్వడానికి తమన్‌ అందించిన బ్యాగ్రౌండ్‌ కూడా ఒక కారణమని ఎన్టీఆర్, తివిక్రమ్ చెప్పారు. అయితే తాజాగా ఈ సినిమా తనకు వందో చిత్రమని థమన్‌ ట్వీట్‌ చేశాడు. తన వందో సినిమాగా అరవింద సమేత చేసినందుకు చాలా సంతోషంగా ఉందని ట్విట్టర్ లో థమన్ తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు.

nanireddy

nanireddy

Next Story