logo

రామాయణ కాలంలోనే టెస్ట్ ట్యూబ్ బేబీ.. ఉదాహరణ సీతమ్మవారే!

రామాయణ కాలంలోనే టెస్ట్ ట్యూబ్ బేబీ.. ఉదాహరణ సీతమ్మవారే!

ఇటీవల హిందీ పాత్రికేయుల దినోత్సవం సందర్భంగా ముఖ్య అతిధిగా ఉత్తరప్రదేశ్ డిప్యూటీ సీఎం దినేశ్‌ శర్మ హాజరయ్యారు. ఆ సందర్బంగా పాత్రికేయంపై మాట్లాడిన శర్మ పాత్రికేయం మహాభారతం కాలం నుంచే ఉందని, ఇప్పుడున్న గూగుల్ అప్పట్లోనే ఉందన్నారు. దానికి ఉదాహరణ ముల్లోకాల సంచారి నారాధమునేనని అభిప్రాయపడ్డారు. ఇదిలావుంటే తాజాగా టెస్ట్‌ ట్యూబ్‌ బేబీ కార్యక్రమానికి హాజరయ్యారు శర్మ ఈ విషయంపై కూడా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రామాయణ కాలంలోనే టెస్ట్‌ ట్యూబ్‌ బేబీల ఎరా మొదలైందని , సీతమ్మవారు మట్టికుండలో జన్మించారని పెద్దలు చెబుతున్నారు. దీన్ని బట్టి అప్పట్లోనే టెస్ట్‌ ట్యూబ్‌ బేబీల ఎరా మొదలైనట్లు తెలుస్తోందని దినేశ్‌ శర్మ వ్యాఖ్యానించారు.

nanireddy

nanireddy

Our Contributor help bring you the latest article around you


లైవ్ టీవి

Share it
Top