మావోల హిట్‌ లిస్ట్‌లో మరో 15 మంది ప్రజా ప్రతినిధులు

x
Highlights

విశాఖ మన్యం.. గజ గజ వణికుతోంది. కిడారి హత్య తర్వాత జరుగుతున్న పరిణామాలతో భయంకరమైన వాతావరణం నెలకొంది. ఓ వైపు ముమ్మరంగా సాగుతోన్న కూంబింగ్‌ మరోవైపు...

విశాఖ మన్యం.. గజ గజ వణికుతోంది. కిడారి హత్య తర్వాత జరుగుతున్న పరిణామాలతో భయంకరమైన వాతావరణం నెలకొంది. ఓ వైపు ముమ్మరంగా సాగుతోన్న కూంబింగ్‌ మరోవైపు మావోయిస్టు వారోత్సవాలతో గరిజనం అల్లాడిపోతున్నారు. ఇవాళ ఏజెన్సీకి డీజీసీ ఠాకూర్‌ వస్తుండటంతో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.

మరోవైపు కిడారి హత్యపై దర్యాప్తు చేస్తున్న సిట్‌ బృందం లిపిటిపుట్టు గ్రామస్తులు, కిడారి డ్రైవర్‌ను విచారించనుంది. ప్రత్యక్ష సాక్షులను, స్థానిక గిరిజనులను కూడా విచారించనుంది. సిట్‌ అధకారి డీసీపీ పకీరప్ప ఆధ్వర్యంలో విచారణ సాగనుంది. మరోవైపు మావోల హిట్‌ లిస్టులో మరో 15 మంది ప్రజా ప్రతినిధులున్నట్లు చెబుతున్నారు. మంత్రి అయ్యన్నపాత్రుడు, గిడ్డి ఈశ్వరి, మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు తదితరులు మావోల హిట్‌ లిస్టులో ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఆంధ్ర ఒడిశా పోలీసుల జాయింట్‌ ఆపరేషన్‌తో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

Show Full Article
Print Article
Next Story
More Stories