లెనిన్‌ సెంటర్‌లో ఉద్రిక్తత

x
Highlights

తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ విజయవాడలో మున్సిపల్ కార్మికులు కదం తొక్కారు. నగర కార్యాలయం నుంచి సీఎం క్యాంప్ కార్యాలయం ముట్టడికి బయలుదేరిన...

తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ విజయవాడలో మున్సిపల్ కార్మికులు కదం తొక్కారు. నగర కార్యాలయం నుంచి సీఎం క్యాంప్ కార్యాలయం ముట్టడికి బయలుదేరిన కార్మికులను లెనిన్ సెంటర్‌ దగ్గర పోలీసులు అడ్డుకున్నారు. ప్రదర్శనకు అనుమతి లేదంటూ బలవంతంగా అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఇరువురి మధ్య తోపులాట చోటు చేసుకుంది. మహిళా కార్మికులను బలవంతంగా అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించడంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులపై పలువురు మహిళలు తిరగబడటంతో పరిస్దితి అదుపు తప్పింది.

Show Full Article
Print Article
Next Story
More Stories