తెలంగాణలో తెలుగు తప్పనిసరి

తెలంగాణలో తెలుగు తప్పనిసరి
x
Highlights

తేనెలొలికే భాష.. అమ్మదనం నిండిన కమ్మనైన భాష.. ప్రాచీన హోదా కలిగిన భాష తెలుగు. అంత గొప్ప బాష.. ఇకనుంచి తెలంగాణలో వెలిగిపోనుంది. మాతృభాష తెలుగుకు పట్టం...

తేనెలొలికే భాష.. అమ్మదనం నిండిన కమ్మనైన భాష.. ప్రాచీన హోదా కలిగిన భాష తెలుగు. అంత గొప్ప బాష.. ఇకనుంచి తెలంగాణలో వెలిగిపోనుంది. మాతృభాష తెలుగుకు పట్టం కట్టేందుకు.. సర్కార్ సిద్ధమయ్యింది. సీబీఎస్‌ఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ, ఐబీ, కేంబ్రిడ్జి తదితర సిలబస్‌ను అనుసరించి నడిచే పాఠశాలల్లో కూడా.. ఒకటో తరగతి నుంచి తెలుగు తప్పనిసరిగా బోధించనున్నారు.

దేశబాషలందు తెలుగు లెస్స అనే నానుడిని నిజం చేస్తూ.. తెలంగాణ ప్రభుత్వం గత డిసెంబర్ లో ప్రపంచ తెలుగు మహాసభలు ఘనంగా నిర్వహించిది. తెలుగు రాష్ట్రాల కవులు, సాహితీవేత్తలు, భాషాపండితులు, ఉపాద్యాయులు, కళాకారులు వివిధ వర్గాల వారు పాల్గోని.. తెలుగు ఖ్యాతిని నలుమూలల చాటేల చర్యలు తీసుకోవాలని సూచించారు. అయితే అనుకున్నదే తడవుగా.. తెలంగాణ ప్రభుత్వం వేంటనే తెలుగుబాషను పరిరక్షించే చర్యలకు శ్రీకారం చుట్టింది.

అందులో భాగంగా రాష్ట్రంలో ఒకటి నుంచి పదోతరగతి విద్యార్థులు తప్పనిసరిగా తెలుగును ఒక సబ్జెక్టుగా చదవాలని.. మార్చిలో తెలంగాణ ప్రభుత్వం చట్టం చేసింది. ఈ విద్యాసంవత్సరం నుంచి ఇది అమలు కానుంది. ఇలాంటి నిర్ణయం ఎంతో ఉన్నతమైందని.. ముందుచూపుతో తీసుకున్న ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు.. తెలుగు భాషాభిమానులు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రభుత్వ నిర్ణయాన్ని ధిక్కరించిన వారిపై.. కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి నాయకులు అంటున్నారు. విద్యార్థులు తెలుగులో మాట్లాడే విధంగా చర్యలు తీసుకోవాలని.. జీవో కచ్చితంగా అమలయ్యే విధంగా చూడాలని కోరుతున్నారు.

అయితే తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెం 15 లో కొన్ని మార్పులు.. చేయాలని సాహితీ వేతలు సూచిస్తున్నారు. తెలుగు తప్పనిసరి చేస్తూ.. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం బాగున్నా.. ఇప్పటివరకూ ఇతర బాషలను సెకెండ్ లాంగ్వేజ్ గా చదువుతున్న విద్యార్థులు.. ఒక్కసారిగా తెలుగుకు మారడం కష్టమంటున్నారు. మరోవైపు పేపర్, టీవీల్లో మాత్రమే ప్రభుత్వ జీవో గురించి చెబుతున్నారు కానీ.. ఇప్పటి వరకూ స్కూల్స్ కి ప్రభుత్వం తరపు నుంచి ఎలాంటి ఉత్తర్వులూ రాలేదని సాహితీ వేత్త మృణాలిని తెలిపారు. మొత్తానికి తెలుగు తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించాల్సి ఉన్నా.. అది కఠినంగా అమలు చేసినప్పుడే దాని ఫలితాలు లభిస్తాయని.. తెలుగు భాషాభిమానులు చెబుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories