పాదయాత్రనే స్ఫూర్తిగా కృష్ణుడు

arun
By arun
Updated on: 24 Dec 2018 2:12 PM IST
పాదయాత్రనే స్ఫూర్తిగా కృష్ణుడు
X

వైసీపీ తీర్థం పుచ్చుకున్నాడట,

వినాయకుడు సినిమా ఫేం కృష్ణుడట,

కత్తిపూడిలో వైఎస్‌ జగన్‌ సమక్షంలోనట,

ఏపీలో వైసీపీ విజయం సాధించడానికేనట.

సినీ నటుడు కృష్ణుడు కూడా ఇప్పుడు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర తూర్పుగోదావరి జిల్లాలో దిగ్విజయంగా కొనసాగుతోంది. కాగా..జగన్‌ పాదయాత్రకు ఆకర్షితుడై సినీ నటుడు కృష్ణుడు వైసీపీలో చేరారు.
సోమవారం పాదయాత్రలో భాగంగా కత్తిపూడిలో వైఎస్‌ జగన్‌ సమక్షంలో నటుడు కృష్ణుడు వైసీపీలో చేరారు. కృష్ణుడికి పార్టీ కుండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు జగన్‌. పార్టీలో చేరిన అనంతరం కృష్ణుడు మాట్లాడుతూ జననేత వైఎస్‌ జగన్‌ పాదయాత‍్రతో స్ఫూర్తి పొంది తాను పార్టీలో చేరినట్లు ఆయన స్పష్టం చేశారు. ఏపీలో వైసీపీ విజయం సాధించడానికి తన వంతు కృషి చేస్తానని కృష్ణుడు పేర్కొన్నారు.

arun

arun

Next Story