ప్రతి పల్లెకి నాలుగో సింహం

ప్రతి పల్లెకి నాలుగో సింహం
x
Highlights

గ్రామ పోలీసు అధికారి వ్యవస్థకి పునాదులు, ప్రతి పంచాయతీలో గ్రామ పోలీసు అధికారులు, గ్రామల్లో అన్నివిధాలుగా వీక్షిస్తారు పరిస్థితులు, గ్రామ ప్రజలకు...

గ్రామ పోలీసు అధికారి వ్యవస్థకి పునాదులు,

ప్రతి పంచాయతీలో గ్రామ పోలీసు అధికారులు,

గ్రామల్లో అన్నివిధాలుగా వీక్షిస్తారు పరిస్థితులు,

గ్రామ ప్రజలకు సమన్వయకర్తగా పనితీరులు. శ్రీ.కో.


ప్రజలకు సనిహితంగా పోలీసులు పనిచేయాలన్న సీఎం కేసీఆర్ ఆదేశాలతో జిల్లాలో గ్రామ పోలీసు అధికారి వ్యవస్థ ప్రారంభానికి రాచకొండ పోలీసు కమిషనరేట్ కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసుకుంటోంది .ప్రతి పంచాయతీలో గ్రామ పోలీసు అధికారిగా ఒక కానిస్టేబుల్ లేదా హెడ్‌కానిస్టేబుల్ పనిచేసే విధముగా, గ్రామ పంచాయతీ కార్యాలయంలోనే వారికి ప్రత్యేకంగా ఒక కుర్చీ, టేబుల్ ఏర్పాటు చేస్తారు. గ్రామ పోలీసు అధికారి అక్కడి సర్పంచ్, వార్డు సభ్యులు, ప్రజలతో మాట్లాడతారు. గ్రామంలోని పరిస్థితులను తెలుసుకుంటారు. గ్రామ పంచాయతీ పరిధిలోని గ్రామాల్లో పర్యటించి మంచి చెడులు తెలుసుకుంటారు. గ్రామంలో ఎవరైనా అసాంఘిక శక్తులుగా ఉంటే వారిని గుర్తిస్తారు. ఆకతాయిలను కట్టడి చేస్తారు. కుటుంబాలు, వ్యక్తుల మధ్య ఎలాంటి ఘర్షణ వాతావరణం ఉన్నా వారిని వెంటనే పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహిస్తారు. గ్రామంలో గొడవలు జరిగే అవకాశాలుంటే స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి గ్రామ పోలీసు అధికారి కృషి చేస్తారు. గ్రామ ప్రజలకు సమన్వయకర్తగా ఆయన పనిచేసేవిధంగా ప్రణాళిక సిద్దం అవుతోన్ధట.

Show Full Article
Print Article
Next Story
More Stories