ఆర్టీసీ సమ్మె.. అవసరమైతే ఎస్మా ప్రయోగిస్తాం!

ఆర్టీసీ సమ్మె.. అవసరమైతే ఎస్మా ప్రయోగిస్తాం!
x
Highlights

తెలంగాణ ఆర్టీసీలో సమ్మె నివారణ దిశగా మంత్రుల బృందం ప్రయత్నాలు కొనసాగిస్తోంది. నిన్న విస్తృత స్థాయిలో మంతనాలు జరిపిన మంత్రులు... ఇవాళ మరోమారు...

తెలంగాణ ఆర్టీసీలో సమ్మె నివారణ దిశగా మంత్రుల బృందం ప్రయత్నాలు కొనసాగిస్తోంది. నిన్న విస్తృత స్థాయిలో మంతనాలు జరిపిన మంత్రులు... ఇవాళ మరోమారు సమావేశమయ్యారు. డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అధ్యక్షతన జరిగిన సమావేశానికి మంత్రులు తుమ్మల నాగేశ్వర్రావు, ఈటల రాజేందర్‌, హరీశ్ రావు, కేటీఆర్, మహేందర్ రెడ్డి, జగదీశ్ రెడ్డి‌తోపాటు ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ హాజరయ్యారు. సమ్మె నివారణ దిశగా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. కడియం శ్రీహరి నివాసంలో భేటీ అయిన స్ట్రాటజిక్‌ కమిటీకి మంత్రి హరీష్‌రావు టీఎంయూ నేతల అభిప్రాయాలను వివరించారు.

ఈ భేటీలో కార్మికులు సమ్మెకు వెళితే తీసుకోవాల్సిన ప్రత్యామ్నాయాలపై చర్చించారు. అవసరమైనపక్షంలో ఎస్మా ప్రయోగిస్తే జరిగే పరిణామాలపై కూడా ఈ భేటీలో చర్చకు వచ్చింది. మంత్రుల అంతర్గత భేటీ అనంతరం టీఎంయూ నేతలతో మంత్రులు చర్చలు జరిపారు. కార్మిక సంఘాల నేతల అభిప్రాయాలను తీసుకున్న మంత్రులు ప్రగతి భవన్‌కు బయలు దేరారు. కార్మిక సంఘాలతో జరిగిన భేటీలో ఉప ముఖ్య మంత్రి కడియం శ్రీహరి, మంత్రులు తుమ్మల నాగేశ్వర్‌ రావు, కేటీఆర్‌, హరీష్‌ రావ్‌, మహేందర్‌ రెడ్డి, జగదీశ్‌ రెడ్డి, ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories