పోలీసు ఉద్యోగాలకు వయోపరిమితి పెంపు

పోలీసు ఉద్యోగాలకు వయోపరిమితి పెంపు
x
Highlights

ఇటీవల విడుదలైన పోలీసు ఉద్యోగాల భారీ నోటిఫికేషన్‌కు మూడేళ్ల పాటు వయోపరిమితిలో సడలింపు కల్పిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు...

ఇటీవల విడుదలైన పోలీసు ఉద్యోగాల భారీ నోటిఫికేషన్‌కు మూడేళ్ల పాటు వయోపరిమితిలో సడలింపు కల్పిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు గురువారం రాష్ట్ర పోలీసు శాఖ సవరణ నోటిఫికేషన్‌కు విడుదల చేసింది.పోలీస్ డిపార్ట్‌మెంట్, డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీసెస్ డిపార్ట్‌మెంట్, ప్రిజన్స్ అండ్ కరెక్షనల్ సర్వీసెస్ డిపార్ట్‌మెంట్ అండ్ ఎస్‌పీఎఫ్(స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్) పోస్టులకు ఈ వయోపరిమితి పెంపు వర్తించనుంది. నోటిఫికేషన్ ప్రకారం 88, 89, 90, 91 కేటగిరీ పోస్టులకు మూడేండ్ల వయోపరిమితిని పెంచుతూ బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో వయోపరిమితి పెంపు ఉత్తర్వుల ప్రకారం నోటిఫికేషన్‌ను బోర్డు సవరించింది. ఈ నెల 9వ తేదీ నుంచి 30వ తేదీ వరకు బోర్డు వెబ్‌సైట్‌ (www.tslprb.in) ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. దరఖాస్తు చేసుకునే ప్రతి పోస్టుకు కూడా వేర్వేరుగా ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories