గుండు హన్మంతరావుకు తెలంగాణ ప్రభుత్వం సాయం

గుండు హన్మంతరావుకు తెలంగాణ ప్రభుత్వం సాయం
x
Highlights

సినిమాల్లో హాస్య‌పాత్ర‌లు వేసి అల‌రించిన గుండు హ‌నుమంత‌రావు కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధ‌ప‌డుతోన్న విష‌యం తెలిసిందే. వారానికి మూడు సార్లు డయాలసిస్...

సినిమాల్లో హాస్య‌పాత్ర‌లు వేసి అల‌రించిన గుండు హ‌నుమంత‌రావు కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధ‌ప‌డుతోన్న విష‌యం తెలిసిందే. వారానికి మూడు సార్లు డయాలసిస్ చేయాల్సి ఉందని వైద్యులు సూచించగా, చికిత్సకు అవసరమైన ఆర్థిక స్తోమత లేకపోవడంతో గుండు హ‌నుమంత‌రావు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న మెగా స్టార్ చిరంజీవి గుండు హనుమంతరావుకి 2లక్షల రూపాయల చెక్ ను ‘మా’ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు శివాజీ రాజా ద్వారా అందజేశారు. ఇక తాజాగా తెలంగాణ ప్రభుత్వం ఆయన చికిత్స నిమిత్తం 5 లక్షల రూపాయల నగదుని ముఖ్యమంత్రి సహాయనిధి నుండి విడుదల చేసింది. ఈ విషయాన్ని కేటీఆర్ తన ట్విట్టర్ ద్వారా తెలియజేస్తూ గుండు హనుమంతరావు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories