ఎట్టకేలకు టీజేఎస్‌ తొలి జాబితా

nanireddy
Updated on: 24 Dec 2018 4:05 PM IST
ఎట్టకేలకు టీజేఎస్‌ తొలి జాబితా
X

వారాలతరబడి చర్చల అనంతరం మహాకూటమిలో భాగస్వామి అయిన తెలంగాణ జనసమితి పార్టీ ఎట్టకేలకు అభ్యర్థుల మొదటి జాబితా విడుదల చేసింది. శుక్రవారం అర్ధరాత్రి వరకు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ఇంచార్జ్‌ కుంతియాతో భేటీ అయిన కోదండరాం తుది చర్చలు జరిపారు. అనంతరం నలుగురుతో కూడిని తొలి జాబితాను విడుదల చేశారు. వారిలో

టీజేఎస్‌ తొలి జాబితా ఇదే.. మల్కాజిగిరి : దిలీప్‌ కుమార్‌ కపిలవాయి, మెదక్‌: జనార్ధన్‌ రెడ్డి దుబ్బాక: చిందం రాజ్‌ కుమార్‌, సిద్దిపేట: భవాని రెడ్డి.

కాగా కూటమిలో భాగంగా టీజేఎస్‌ పార్టీకి 8 స్థానాలు కేటాయించింది కాంగ్రెస్ పార్టీ. ఈ క్రమంలో మరో నాలుగు సీట్లు కావాలని పట్టుబట్టారు కోదండరాం. అయితే అధిష్టానం రంగంలోకి దిగి ఆయనను ఒప్పించింది. దాంతో ఇవాళ పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాలో నలుగురు అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. రెండో జాబితాను ఆదివారం ప్రకటిస్తామని తెలిపారు. అయితే కోదండరాం పోటీ చేసే అంశంపై మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు.

nanireddy

nanireddy

Next Story