ప్ర‌భుత్వంలో కాకపుట్టిస్తున్న పావని పర్సంటేజీల వ్య‌వ‌హారం

ప్ర‌భుత్వంలో కాకపుట్టిస్తున్న పావని పర్సంటేజీల వ్య‌వ‌హారం
x
Highlights

ఒక్క స్టేట్‌మెంట్ ఒకే ఒక్క స్టేట్‌మెంట్ ఇప్పుడు స్టేట్ స్టేట్ మొత్తం హాట్ టాపిక్‌గా మారిపోయింది. కమీషన్లపై సిరిసిల్ల మున్సిపల్ ఛైర్‌పర్సన్ చేసిన...

ఒక్క స్టేట్‌మెంట్ ఒకే ఒక్క స్టేట్‌మెంట్ ఇప్పుడు స్టేట్ స్టేట్ మొత్తం హాట్ టాపిక్‌గా మారిపోయింది. కమీషన్లపై సిరిసిల్ల మున్సిపల్ ఛైర్‌పర్సన్ చేసిన కామెంట్స్ తెలుగు రాష్ట్రాల్లో వైరల్‌గా మారాయి. మంత్రి సూచనల మేరకే పర్సంటేజీలు తీసుకుంటున్నామని పావని చెప్పడంపై సిరిసిల్ల వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు సిరిసిల్లకు ఇప్పటివరకు ఎన్నికోట్లు కేటాయించారు ఎంతమేర అభివృద్ధి జరిగింది. వాస్తవంలోకి వెళ్తే తెలుస్తున్నదేంటి.?

సిరిసిల్ల మున్సిపాలిటీని రాష్ట్రంలోనే ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో మున్సిపల్ మినిస్టర్ అడిగినన్ని నిధులు మంజూరు చేశారు. రోడ్ల వెడల్పు, డివైడర్లు, స్ట్రీట్ లైట్లు, పార్కులు, మినీ ట్యాంక్ బండ్‌ ఏర్పాటు ఇలా చాలా అభివృద్ధి పనులకు వేల కోట్లు కేటాయించారు. తాజా బడ్జెట్‌లోనూ సిరిసిల్ల పట్టణాభివృద్ధికి116 కోట్లు ప్రతిపాదించారు.

ప్రభుత్వం వందల కోట్లు కేటాయిస్తున్నా రియల్ సీన్ మాత్రం వేరేలా ఉంది. ప్రభుత్వం మంజూరు చేస్తున్న నిధులకు అక్కడ జరుగుతున్న పనులకు పొంతనే లేదంటున్నారు. అధికార పార్టీ నాయకులు, అధికారుల మధ్య సమన్వయలోపంతో పనులు జరగడం లేదని చెప్తున్నారు. మొదట్లో అభివృద్ధి పనులు తొందరగానే జరిగినా రాను రాను సీన్ మారిపోయిందంటున్నారు సిరిసిల్ల వాసులు.

అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి కావాలన్న మంత్రి ఆదేశాల మేరకు ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు పనులు చేసుకుంటూ పోతున్నారు. అధికారులు, నేతల మధ్య సమన్వయలోపంతో పనుల్లో నాణ్యత తగ్గిపోతోందని చెప్తున్నారు. అంతేకాదు చేసిన పనినే మళ్లీ మళ్లీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల నిధులు దుర్వినియోగం అవుతున్నాయన్న ఆరోపణలు వస్తున్నాయి.

మంత్రి స్థానికంగా ఉండకపోవడం మున్సిపల్ పాలకవర్గం కూడా పూర్తిస్థాయిలో పట్టించుకోకపోవడంతో అభివృద్ధి పనులు మమ అనిపిస్తున్నారనే విమర్శలు ఎక్కువవుతున్నాయి. అన్ని పనులు ఒకేసారి మొదలు పెట్టడంతో స్థానికంగా ప్రజలు కూడా ఇబ్బందులు పడుతున్నారని చెప్తున్నారు. వీటన్నింటికి తోడు మున్సిపల్ ఛైర్‌పర్సన్ పావని పర్సంటేజీలపై చేసిన కామెంట్స్ రాష్ట్రవ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి. ఈ వ్యవహారంపై స్థానికులు రగిలిపోతున్నారు.

కాంట్రాక్ట్ పనుల్లో పర్సంటేజీలపై మున్సిపల్ ఛైర్‌పర్సన్ పావని చేసిన కామెంట్స్‌ను విపక్షాలు అస్త్రంగా మార్చుకున్నాయి. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ సిరిసిల్లకు చెందిన మంత్రి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటివరకు సైలెంట్‌గా ఉన్న తెలంగాణ రాజకీయాలను సిరిసిల్ల మున్సిపల్ ఛైర్‌పర్సన్ వ్యవహారం ఓ కుదుపు కుదిపేసింది. దీనిపై ఇప్పటికే విపక్షాలు ప్రభుత్వంపై విమర్శల దాడి చేస్తున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories