టీ కాంగ్ వ్యూహాలు మారుతున్నాయ్

x
Highlights

ఎన్నికల ముందు టీ-కాంగ్రెస్ నేతలు సమయానికి తగినట్టు వ్యూహాలు మార్చుకోవాలని ప్లాన్ చేసుకుంటున్నారు. తెలంగాణలో రాజకీయ సమీకరణాలు బేరీజు వేస్తూ ముందస్తూ...

ఎన్నికల ముందు టీ-కాంగ్రెస్ నేతలు సమయానికి తగినట్టు వ్యూహాలు మార్చుకోవాలని ప్లాన్ చేసుకుంటున్నారు. తెలంగాణలో రాజకీయ సమీకరణాలు బేరీజు వేస్తూ ముందస్తూ వ్యూహాలకూ సిద్ధమవుతున్నారు. అదే సమయంలో పార్టీలో ఉన్న అసమ్మతులకు, అసంతృప్తులకు చెక్ పెట్టేందుకు ఉత్తమ్ చాకచక్యంగా వ్యవహరిస్తున్నారు.

ఎన్నికలు దగ్గర పడుతుండడంతో హస్తం పార్టీ ప్రజల్లోకి వెళ్లడంతోపాటు ఎన్నికల రణరంగాన్ని ఎదుర్కొనేందుకు తమతో కలిసి వచ్చే పార్టీలపై ఎప్పటికప్పుడు అంచనాలు వేసుకుంటోంది. గతంలో మహాకూటమిపై కాంగ్రెస్ లీకులిచ్చి ప్రధాన ప్రతిపక్షాలన్నీ కలసి వస్తాయని చెప్పే ప్రయత్నం చేసింది. కానీ ప్రస్తుతం సీన్ మారుతుండడతో ఇప్పుడు ఆ మాట ఎత్తకుండా తామే సొంతంగా పోటీ చేసి అధికార పార్టీకి షాకిస్తామంటూ ఉత్సాహం కనబరుస్తోంది.

శత్రువు బలంగా ఉన్నప్పుడు కూటమి కట్టి దెబ్బతీయాలనుకున్న కాంగ్రెస్ తో ప్రమేయం లేకుండానే సీపీఎం సొంత కూటమి ఏర్పాటు చేసుకుంది. ఇక కమలనాథులు కాంగ్రెస్ తో కలసి వచ్చే అవకాశం లేదు కాబట్టి మహాకూటమి సాధ్యం కాదనే భావనకు హస్తం పార్టీ నేతలు వచ్చినట్లు భావిస్తున్నారు.

ఇప్పుడున్న పరిస్థితుల్లో టీ-జాక్ గనక పార్టీ స్థాపిస్తే వారితో కలిసి వెళ్లడానికే తాము సిద్దంగా ఉన్నామంటూ హస్తం పార్టీ లీకులిస్తోంది. టీ-టీడీపీలో రేవంత్ ఉన్నప్పటి పరిస్థితి కంటే రేవంత్ కాంగ్రెస్ లోకి వచ్చాక సీన్ మారిపోయింది. ఇప్పుడు టీ-టీడీపీలో ఉన్న నేతలెవ్వరూ కాంగ్రెస్ కు అనుకూలంగా మాట్లాడే పరిస్థితి లేదు కాబట్టి వారిపై ఆశలు వదిలేసుకున్నారు. ఇక మిగిలిన సీపీఐ ఒక్కటే కాంగ్రెస్ తో చెలిమికి సిద్ధంగా ఉండడంతో ఈ మూడు సెక్షన్లతో కలిసి వెళ్లడానికి హస్తం పార్టీ ప్లాన్ చేసుకుంటున్నట్టు సమాచారం. కోదండరాంతో పొత్తు పెట్టుకోవడం ద్వారా టిఆర్ఎస్ అనుకూల నేతలు ఉద్యమంలో పనిచేసిన నేతలు, దాని సానుభూతిపరులు ఈ కూటమికే ఓట్లు వేస్తారనే అంచనాలో టీ-కాంగ్రెస్ ఉంది. జేఏసీ సైతం కాంగ్రెస్ తో కలిసి వెళ్లడానికి సుముఖంగా ఉండడంతో హస్తం పార్టీ నేతలు స్నేహ హస్తం అందించడానికి రడీగా ఉన్నారు. తగిన ముహూర్తం చూసుకుని ఆ ప్రకటన కూడా చేస్తారంటున్నారు రాజకీయ పరిశీలకులు.

Show Full Article
Print Article
Next Story
More Stories