తెలంగాణ కాంగ్రెస్ అధినేతకు తెరుకోలేని ఎదురు దెబ్బ...

x
Highlights

తెలంగాణ కాంగ్రెస్ అధినేతకు తెరుకోలేని ఎదురు దెబ్బ తగిలిందా అధిపత్యానికి పోయి చేయి కాల్చుకున్నారా పార్టీలో అందరిని మోరల్ గా దెబ్బ తీయబోయి ఆయనే...

తెలంగాణ కాంగ్రెస్ అధినేతకు తెరుకోలేని ఎదురు దెబ్బ తగిలిందా అధిపత్యానికి పోయి చేయి కాల్చుకున్నారా పార్టీలో అందరిని మోరల్ గా దెబ్బ తీయబోయి ఆయనే కోలుకోలేని దెబ్బతిన్నారా NSUI ఎన్నికలో తలదూర్చి షాక్ తిన్నారా అవుననే అని పిస్తుంది తాజా పరిణామాలు గమనిస్తే..

తెలంగాణలో టిఆరెస్ తో ఢీ అంటే ఢీ అంటున్న కాంగ్రెస్ నేతలు ప్రత్యర్ధులపై గురి పెట్టాల్సిన బాణాన్ని సొంత పార్టీపైనే గురిపెట్టుకుని దెబ్బై పోయారా? సీన్ చూస్తే నిజమే అనిపిస్తోంది అధికార పార్టీపై యుద్ధ రచన చేయాల్సిన నేతలు పార్టీ విద్యార్ధి అనుబంధ సంఘాల ఎన్నికల్లో వేలు పెట్టి చేయి కాల్చుకున్నారు NSUI ఎన్నికల్లో వేలుపెట్టి ఓ వర్గానికి మద్దతు పలికి గెలిపించాలని వీర లెవెల్లో ప్రయత్నించి దెబ్బ తినేసిన ఆ లీడర్ పిసిసిలో ఓ ముఖ్యనేత..రాష్ట్రానికి సిఎంను నిర్ణయించాల్సిన వ్యక్తి మరీ దారుణంగా విద్యార్ధి సంఘం ఎన్నికల్లో తలదూర్చడమేంటనే విమర్శలూ ఇప్పుడు గాంధీ భవన్ లో చక్కర్లు కొడుతున్నాయి.

పిసిసి ముఖ్య నేత మరీ ఇంత దిగజారిపోయి వ్యవహరిస్తున్నారేంటంటూ బుగ్గలు నొక్కుకుంటున్నారు. NSUI అంటే కాంగ్రెస్ రాజకీయ నేతలను తయారుచేసే కర్మాగారం లాంటిది విద్యార్ధులకు రాజకీయ నడవడిని నేర్పాల్సిన పెద్దలు యూనియన్లలో తలదూర్చి ఓ అభ్యర్ధి గెలుపు కోసం పావులు కదపడంతో కాంగ్రెస్ లో రచ్చ రాజకీయం నడిచింది. NSUI అధ్యక్ష పదవికి మొత్తం 11 మంది పోటీ పడగా, వారిలో ముగ్గురు ప్రధాన పోటీదార్లు. మన పిసిసి నేత అందులో తనకు కావాలసిన దోస్త్ కొడుకుని గెలిపించుకోవాలని ప్లాన్ చేశారు. దానికోసం కాంగ్రెస్ అధికార ప్రతినిధి కుమారుడిని పోటీ నుంచి తప్పుకుంటే పదవిలో ప్రమోషన్ తో పాటూ ఎమ్మెల్యే టిక్కెట్ కూడా ఇస్తానంటూ ఆఫర్ చేశారు. ఆవెంటనే ఆ కార్పొరేటర్ తన కొడుకుని పోటీ నుంచి తప్పించాడు. సో ఇంక రేసులో ఉన్నది ఇద్దరే.. ఒకరు మన పిసిసి అనుకూల వర్గ నేత కొడుకు సృజన్ కాగా, మరొకరు NSUI అధ్యక్షుడు వెంకట్.. వీరిలో వెంకట్ ను ఓడించడానికి మన ముఖ్య నేత ప్లాన్ లు రచించారు.

ఆఫ్టరాల్ NSUI ఎన్నికల కోసం అసెంబ్లీ ఎన్నికలంత సీన్ చేసేశారాయన జిల్లా పర్యటనలు, అనుకూల వర్గం నేతల మంతనాలు, జిల్లాల వారీ సమావేశాలు అంటూ ఫోన్లు చేసి మరీ సృజన్ గెలుపుకోసం ప్రచారం చేశారు. అది చాలదన్నట్లు క్యాంప్ రాజకీయాలకు కూడా తెర లేపారు. వెంకట్ ను ఓడించాలనే లక్ష్యంగా పెట్టుకొని పీసీసీ ముఖ్య నేత టీం పనిచేస్తుంటే ఎలర్ట్ అయిన వెంకట్ వర్గం ఇతర నేతలను కలుపుకుపోయి ఎన్నికల్లో గెలిచి కంగు తినిపించింది. 28 జిల్లాలకు జరిగిన NSUI ఎన్నికల్లో 24 జిల్లాలో మాజీ NSUI వర్గం గెలుపొందడమే కాదు అధ్యక్షడిగా వెంకట్ భారీ మెజార్టీతో గెలుపొందారు. చివరికి మన పిసిసి లీడర్ గారి సొంత జిల్లాలోనే ఆయన మాట ఎవరూ పట్టించుకోలేదని తేలింది. 24 జిల్లాల పిసిసి ప్రెసిడెంట్లలో 23 మంది వెంకట్ మద్దతు దారులే గెలిచారు.

అందరికీ దిశానిర్దేశం చేయాల్సిన పిసిసి నేత తానే ఓ వర్గం కొమ్ముకాసి పార్టీలో ఎన్నికల రాజకీయాలను రక్తికట్టించడంపై పార్టీలో వ్యతిరేకత పెరుగుతోంది. NSUI ఎన్నికల్లోనే ఆయన ప్రతిభ ఇంత పేలవంగా ఉంటే ఇక అసెంబ్లీ ఎన్నికల్లో ఎలా ఉంటుందో అన్న డౌట్లు రేగుతున్నాయి.అసలు విద్యార్ధి సంఘం ఎన్నికలలో పిసిసి నేతలు ఇన్వాల్వ్ అవడమేంటనే విమర్శలూ వినిపిస్తున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories