సీనియర్లకు సన్‌స్ట్రోక్‌...కాంగ్రెస్ నేతలకు వారసుల ఫీవర్

x
Highlights

తెలంగాణ కాంగ్రెస్‌లో సీనియర్ల పుత్రుల రూపంలో కష్టాలు వచ్చిపడ్డాయి. తండ్రులు రిటైర్మెంట్ కాకముందే కొడుకుల సీట్ల కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. ఒక...

తెలంగాణ కాంగ్రెస్‌లో సీనియర్ల పుత్రుల రూపంలో కష్టాలు వచ్చిపడ్డాయి. తండ్రులు రిటైర్మెంట్ కాకముందే కొడుకుల సీట్ల కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. ఒక కుటుంబంలో ఒక్కరికే టిక్కెట్టు నిబంధన ఉన్న కాంగ్రెస్‌లో ఇంటి పోరు అధికంగా ఉండడంతో కాకలు తీరిన నేతలు పైరవీలు చేయక తప్పడం లేదు. దీంతో పార్టీ అత్యంత సీనియర్ నేత ఢీల్లికి వెళ్లక తప్పలేదు. పైరవీలు నా నైజం కాదన్న ఆ నేత ఢిల్లీలో కొడుకు టిక్కెట్టు కోసం మకాం వేశారు. దీంతో కాంగ్రెస్ సీనియర్లంతా హస్తన బాట పడుతున్నారు. ఇంతకీ ఎవరా నేత? ఏమా కష్టాలు.

వారసులు పొలిటికల్ ఎంట్రీకి ఉవ్విళ్లూ ఉరుతుండటంతో వారిని సేఫ్‌గా ల్యాండ్ చేయడానికి సీనియర్లు ప్రయత్నం ముమ్మరం చేస్తున్నారు. ఇప్పటికే పార్టీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు ముమ్మరం చేస్తుండటంతో అలెర్ట్ అయ్యారు. తమ వారసులకు టికెట్లు ఇప్పించుకోవడానికి హస్తిన స్థాయిలో మంత్రాంగం నడుపుతున్నారు. అందులో ఇప్పుడు సీనియర్ నాయకుడు జానారెడ్డి ముందు వరుసలో ఉన్నారు. తన రాజకీయ ప్రస్తానం ప్రారంభం అయినప్పటి నుంచి ఇప్పటి వరకు టికెట్ల కోసం పైరవీ చేయాల్సిన అవసరం జానారెడ్డికి రాలేదు. ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన జానారెడ్డికి ఇప్పుడు కూడా తన కోసం ఆందోళన చెందాల్సిన అవసరం కూడా లేదు. ఎప్పుడూ తన కోసం ఇబ్బందిపడని జానారెడ్డికి ఇప్పుడు పుత్రుని బెంగపట్టుకుంది. కొడుకు రఘువీర్ పొలిటికల్ లాండింగ్ కోసం ఆయన ఇప్పడు ఢిల్లీకి టేక్ ఆఫ్ అయ్యారు.

జానారెడ్డి కుమారుడు రఘువీర్ ఎన్నికల బరిలో దిగాలని డిసైడ్ అయ్యారు. ఇప్పటికే ఆయన మిర్యాలగూడలో ప్రచారాన్ని ప్రారంభించారు. అయితే జానారెడ్డికి ఉన్న పలుకుబడితో తన కుమారునికి టికెట్ రావడం ఖాయమన్న ప్రచారం జరిగింది. కానీ ఒక కుటుంబానికి ఒకే టికెట్ అంటూ పార్టీలో నేతలు కొత్త వాదనలు తెరమీదకు తెచ్చారు. దీంతో అలెర్ట్ అయిన జానారెడ్డి నష్టం జరక్కుండా అప్రమత్తమయ్యారు. తన కుమారుని వెంటబెట్టుకుని హస్తినబాట పట్టారు. తనకు నాగార్జునసాగర్, కుమారుడికి మిర్యాలగూడ టికెట్ కోసం హైకమాండ్ పెద్దలతో మంత్రాంగం నడుపుతున్నారు.

కాంగ్రెస్ పార్టీలో చాలామంది నేతలది ఇప్పుడు అదే పరిస్థితి. మాజీమంత్రి సబితా ఇంద్రారెడ్డి మహేశ్వరం నియోజకవర్గం నుంచి పోటీకి సిద్ధమయ్యారు. ఆమె కుమారుడు కార్తీక్‌రెడ్డి రాజేంద్రనగర్‌లో ప్రచారం మొదలు పెట్టారు. అంజన్‌కుమార్ యాదవ్ కొడుకు అనిల్‌యాదవ్, మాజీ మంత్రి ముఖేష్‌గౌడ్ కుమారుడు విక్రమ్‌గౌడ్ ముషీరాబాద్ నుంచి పోటీకి పావులు కదుపుతున్నారు. ఇక మాజీ మంత్రి డీకే అరుణ తన కుమార్తెను ఎన్నికల బరిలో దించాలన్న గట్టి పట్టుదలతో ఉన్నారు. మరో మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి కూడా తన కొడుకు సర్వోత్తమ్‌‌రెడ్డికి టికెట్ కోరుతున్నారు. మరి వీరి ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories