సెకండ్ ఫేజ్...

x
Highlights

కాంగ్రెస్ రెండో విడత ప్రచారానికి కసరత్తు చేస్తుంది. తక్కువ సమయంలో ఎక్కువ నియోజకవర్గాల్లో ప్రచారం చేయాలని యోచిస్తోంది. మరోసారి ప్రచారానికి రాహుల్...

కాంగ్రెస్ రెండో విడత ప్రచారానికి కసరత్తు చేస్తుంది. తక్కువ సమయంలో ఎక్కువ నియోజకవర్గాల్లో ప్రచారం చేయాలని యోచిస్తోంది. మరోసారి ప్రచారానికి రాహుల్ గాంధీని రప్పించనుంది. టీఆర్ ఎస్ వైఫల్యాలను ఎండగడుతూ కాంగ్రెస్ హామీలను విస్తృతంగా ప్రచారం చేయాలని ప్రచార కమిటీ భేటీలో హస్తం నేతలు నిర్ణయించారు.

హైదరాబాద్ గోల్కొండ హోటల్ లో రెండో విడత ప్రచార యాత్ర నిర్వాహణ పై కాంగ్రెస్ ప్రచార కమిటీ సమావేశం జరిగింది. ఆ పార్టీ ముఖ్య నేతలు కొప్పుల రాజు, కుంతియా, ప్రచార కమిటీ చైర్మన్ భట్టి విక్రమార్క, డీకే అరుణ, ఉత్తమ్ కుమార్ రెడ్డి, విజయశాంతి తదితరులు పాల్గొన్నారు. మహాబుబ్ నగర్ జిల్లాలో మొదటి దఫాలో ప్రచారం పూర్తి అయింది. రెండో దఫా ప్రచారాన్ని నల్గొండ లేదా కరీంనగర్ జిల్లా నుంచి ప్రచారం ప్రారంభించాలని యోచిస్తున్నారు. మహాకూటమిలో సీట్ల సర్దుబాటు పూర్తి అయిన తర్వాత మిత్రపక్షాలతో కలిసి ప్రచారం చేయాలని కాంగ్రెస్ నేతలు ఆలోచన చేస్తున్నారు. కాంగ్రెస్ బలమైన అభ్యర్థుల స్థానాల మినహాయించి మిగతా చోట్ల సభలు పెట్టాలని ప్రచార కమిటీ భావిస్తోంది. ఈ నెల 27 లేదా 28న మరోసారి రాహుల్ గాంధీ పర్యటన ఉంటుందని, కరీంనగర్, వరంగల్ లలో సభలు ఉంటాయని హస్తం నేతలు చెబుతున్నారు.

సీనియర్ నేత వి. హనుమంత రావు ఆధ్వర్యంలో జరుగుతున్న ఇందిరా విజయ రథ యాత్ర , ప్రచార కమిటీ నిర్వహిస్తున్న ప్రచార రోడ్ మ్యాప్ లపై సమన్వయం చేసుకొని ముందుకు వెళ్లాలని కాంగ్రెస్ నేతలు నిర్ణయించారు. రెండో విడత ప్రచార రోడ్ మ్యాప్ ను సోమవారం జరిగే సమావేశంలో తుదిరూపు ఇవ్వనున్నారు. ప్రచార వేడిని మరింత పెంచాలని ప్రచార కమిటీ నిర్ణయించింది. టీఆర్ ఎస్ వైఫల్యాలను ఎండగడుతూ, కాంగ్రెస్ ఎన్నికల హామీలను విస్త్రతంగా ప్రచారం చేస్తూ ఓటర్లను తమ వైపు ఆకర్షించాలని ప్రచార కమిటీ ప్లానింగ్ చేస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories