రెండు నిమిషాల్లోనే ముగిసిన మంత్రివర్గ సమావేశం

రెండు నిమిషాల్లోనే ముగిసిన మంత్రివర్గ సమావేశం
x
Highlights

ఉత్కంఠకు తెరపడింది. అనుకుంటున్నదే జరిగింది. 9 నెలలకు ముందుగానే అసెంబ్లీ రద్దయింది. ముందస్తుకు లైన్‌క్లియర్‌ చేస్తూ తెలంగాణ మంత్రివర్గం ఏకవాక‌్య...

ఉత్కంఠకు తెరపడింది. అనుకుంటున్నదే జరిగింది. 9 నెలలకు ముందుగానే అసెంబ్లీ రద్దయింది. ముందస్తుకు లైన్‌క్లియర్‌ చేస్తూ తెలంగాణ మంత్రివర్గం ఏకవాక‌్య తీర్మానం ఆమోదించింది. కేవలం రెండంటే రెండు నిమిషాలే భేటీ అయిన కేబినెట్‌ ఈ మేరకు రద్దుకే మొగ్గు చూపింది. దాదాపు నెల రోజులుగా సాగుతున్న ఉత్కంఠతకు ఏకవాక్యం తెరదించినట్టయింది. అసెంబ్లీ రద్దు తర్వాత ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధమంటున్న పాలకపక్షం ఒకరకంగా ప్రతిపక్షానికి సవాల్‌ విసిరినట్టయింది. ప్రస్తుతం కొనసాగుతున్న అన్ని రాజకీయ పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు మాజీలవగా... ప్రభుత్వం అపద్ధర్మంగా కొనసాగనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories