బ్రేకింగ్‌...తెలంగాణ అసెంబ్లీ రద్దు

బ్రేకింగ్‌...తెలంగాణ అసెంబ్లీ రద్దు
x
Highlights

అంతా ఊహించినట్టుగానే తెలంగాణ అసెంబ్లీ రద్దుకు మంత్రి వర్గం సిఫారసు చేసింది. ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రారంభమైన మంత్రివర్గ సమావేశం...

అంతా ఊహించినట్టుగానే తెలంగాణ అసెంబ్లీ రద్దుకు మంత్రి వర్గం సిఫారసు చేసింది. ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రారంభమైన మంత్రివర్గ సమావేశం శాసనసభను రద్దు చేస్తూ ఏకవాక్య తీర్మానం చేసింది. కాసేపట్లో సీఎం కేసీఆర్ మంత్రులతో కలిసి ప్రత్యేక బస్సులో రాజ్‌భవన్ వెళ్లనున్నారు. అసెంబ్లీ రద్దు నిర్ణయాన్ని తెలియజేసిన తరువాత మంత్రులతో కలిసి సీఎం కేసీఆర్ గన్ పార్క్ చేరుకోనున్నారు. అమరవీరుల స్థూపం దగ్గర నివాళులు అర్పించి నేరుగా తెలంగాణ భవన్ చేరుకోనున్నారు. అనంతరం తాజా పరిణామాలపై మీడియా సమావేశం నిర్వహించున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories