logo
జాతీయం

గుడ్లు పెడుతున్న బాలుడు!

గుడ్లు పెడుతున్న బాలుడు!
X
Highlights

ఇప్పటివరకు పక్షులు, పాములు లాంటివే గుడ్లు పెడతాయని మనకు తెలుసు. కానీ, ఇండోనేషియాలో ఓ 14 ఏళ్ల బాలుడు గుడ్లు...

ఇప్పటివరకు పక్షులు, పాములు లాంటివే గుడ్లు పెడతాయని మనకు తెలుసు. కానీ, ఇండోనేషియాలో ఓ 14 ఏళ్ల బాలుడు గుడ్లు పెడుతూ అందర్నీ అవాక్కయ్యేలా చేస్తున్నాడు. గత రెండేళ్లలో అతను మొత్తం 20 గుడ్లు పెట్టాడు. ఈ విషయం వినగానే వైద్యులు షాక్ అవుతున్నారు. వివరాల్లోకెళితే, ఇండోనేషియాలోని గోవా ప్రాంతానికి చెందిన అక్మాల్ 2016 నుంచి తాను క్రమం తప్పకుండా గుడ్లు పెడుతున్నట్లు చెబుతున్నాడు. సదరు గుడ్ల ను తెరిచి చూడగా అంతా తెల్లసొన లేదా మొత్తం పచ్చసొనతో ఉంటున్నాయని బాలుడి తండ్రి రుస్లి చెప్పారు. దీంతో బాలుడు తరుచుగా అనారోగ్యంతో చికిత్స పొందుతున్నాడు. ఇటీవల వైద్యుల ఎదుట రెండు గుడ్లను పెట్టాడు. ఈ రెండేండ్లలో తమ కుమారుడు 20 గుడ్ల ను పెట్టాడని.. తొలిసారి పెట్టిన గుడ్డును తెరిచి చూడగా మొత్తం పచ్చసొన మాత్రమే ఉన్నదని రుస్లి చెప్పారు. బాలుడి తీరు వైద్యులకు అంతుబట్టడం లేదు. మానవ శరీరం నుంచి గుడ్లు రావడం అనేది అసాధ్యమని వైద్యులు అంటున్నారు. ఎవరో అక్మల్ మలద్వారంలో గుడ్లను బలవంతంగా పెడుతున్నట్టు అనుమానిస్తున్నామని దీన్ని తాము ప్రత్యక్షంగా చూడలేదన్నారు. వైద్యుల వాదనను రుస్లి ఖండించారు. అక్మల్ పరిస్థితిని అధ్యయనం చేయడానికి వైద్యులు అతడిని షేక్ యూసుఫ్ దవాఖానలో ఉంచారు.

Next Story