విద్యార్ధినిని గర్భవతిని చేసిన ఉపాధ్యాయుడు....టీచర్‌ను బట్టలూడదీసి ఊరేగించారు..

విద్యార్ధినిని గర్భవతిని చేసిన ఉపాధ్యాయుడు....టీచర్‌ను బట్టలూడదీసి ఊరేగించారు..
x
Highlights

పవిత్రమైన వృత్తిలో ఉంటూ దారితప్పిన ఉపాధ్యాయుడికి స్ధానికులు దేహశుద్ది చేసి నగ్నంగా తిప్పిన ఘటన పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో జరిగింది. స్ధానికంగా ఉండే...

పవిత్రమైన వృత్తిలో ఉంటూ దారితప్పిన ఉపాధ్యాయుడికి స్ధానికులు దేహశుద్ది చేసి నగ్నంగా తిప్పిన ఘటన పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో జరిగింది. స్ధానికంగా ఉండే ఓ ప్రయివేటు కళాశాలలో ఇంగ్లీష్ ఉపాధ్యాయుడిగా ఉన్న రాంబాబు పాలిటెక్నిక్ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్ధినిపై గత కొద్ది కాలంగా అత్యాచారానికి పాల్పడుతున్నారు. విషయం బయటచెబితే చంపేస్తానంటూ బెదిరిస్తూ తన కోరిక తీర్చుకుంటున్నాడు. అయితే ఇటీవల విద్యార్ధిని గర్భం దాల్చడంతో అబార్షన్ చేసేందుకు మందులు ఇచ్చాడు. ఇవి వికటించడంతో విషయం వెలుగు చూసింది. రాంబాబు ఆగడాన్ని తెలుసుకుని ఆగ్రహానికి గురైన స్ధానికులు, చుట్టుపక్కల వారు ఒక్కసారిగా దాడికి దిగారు. రోడ్డుపై నగ్నంగా ఊరేగిస్తూ దాడికి పాల్పడ్డారు. పరిస్ధితి ఉద్రిక్తంగా మారడంతో విషయం తెలుసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. స్ధానికుల దాడిలో తీవ్రంగా గాయపడిన రాంబాబును ఆసుపత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories