చంద్రబాబు ఇలాకాలో దారుణం.. మహిళను వివస్త్రను చేసిన ప్రత్యర్ధులు

x
Highlights

తెలుగుదేశం నేతలు, కార్యకర్తల దౌర్జన్యాలకు అంతే లేకుండా పోతోంది. ఇటీవల విశాఖలో భూకబ్జాను అడ్డుకున్నందుకు ఓ మహిళను వివస్త్రను చేసిన ఘటన మరువక ముందే...

తెలుగుదేశం నేతలు, కార్యకర్తల దౌర్జన్యాలకు అంతే లేకుండా పోతోంది. ఇటీవల విశాఖలో భూకబ్జాను అడ్డుకున్నందుకు ఓ మహిళను వివస్త్రను చేసిన ఘటన మరువక ముందే మరోసారి అలాంటి దారుణమే జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సొంత నియోజకవర్గం కుప్పంలో టీడీపీ మద్దతుదారులు కీచకపర్వానికి దిగారు. మహిళను వివస్త్రను చేసి కిరాతకంగా ప్రవర్తించారు.

కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం గుంజార్లపల్లికి చెందిన భార్యాభర్తలకు అదే గ్రామానికి చెందిన భాగ్యలక్ష్మితో కొంతకాలంగా గొడవలున్నాయి. ఇదే విషయాన్ని ఉమ దంపతులు అధికారుల దృష్టికి తీసుకు వచ్చారు. దాంతో ఉమపై భాగ్యలక్ష్మి, ఆమె బంధువులు దాడికి దిగారు. తమపైనే ఫిర్యాదు చేస్తావా అంటూ బట్టలూడదీసి కొట్టారు. ఉమను వీధిలోకి లాక్కొచ్చి అందరి ముందే వివస్త్రను చేశారు. రాళ్లతో కొట్టి... నోటితో కొరికి దారుణంగా గాయపరిచారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన భర్తను కూడా చితకబాదారు.

Show Full Article
Print Article
Next Story
More Stories