తమ్ముళ్ల స్ట్రాటజీ... నిలిచి గెలిపిస్తుందా

తమ్ముళ్ల స్ట్రాటజీ... నిలిచి గెలిపిస్తుందా
x
Highlights

తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తొంది. ప్రతిపక్షాలను దెబ్బతీసేందుకు కొత్త స్ట్రాటజీని అమలు చేస్తోంది. ఇటు వైసీపీని అటు బిజెపిని ఇరకాటంలో...

తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తొంది. ప్రతిపక్షాలను దెబ్బతీసేందుకు కొత్త స్ట్రాటజీని అమలు చేస్తోంది. ఇటు వైసీపీని అటు బిజెపిని ఇరకాటంలో పెట్టేందుకు పావులు కదుపుతోంది. కొత్త నినాదాలతో ముందుకు వస్తోంది. మహానాడు వేదికగా చంద్రబాబు, లోకేశ్ లు చేసిన ప్రసంగాలు భవిష్యత్తులో టిడిపి వ్యూహం ఎలా ఉండనుందో బహిర్గతం చేశాయి.

టిడిపి నేతలు తమ ప్రసంగాలలో దూకుడును పెంచారు. మహానాడు వేదికను ప్రత్యర్ధులను ఇరకాటంలో పెట్టేందుకు ఉపయోగించుకుంటున్నారు. కేంద్రం చేసిన నమ్మక ద్రోహం, కుట్ర రాజకీయాలను ప్రజలకు మరోసారి వివరించడంతో టిడిపి నేతలు విజయం సాధించారు. అధినేత చంద్రబాబు తాను చేపట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ఇప్పటి వరకు పూర్తయిన ప్రాజెక్టులు, ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల గురించి, వాటి వల్ల ప్రజలకు జరిగే మేలు గురించి చంద్రబాబు వివరించారు. అదే విధంగా వైసీపీ అధినేత జగన్, కేంద్రంతో చేతులు కలిపి రాష్ట్రాభివృద్ధిని అడ్డుకుంటున్నారని చంద్రబాబు ఆరోపించారు.

అధినేత చంద్రబాబు బిజెపిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతుంటే...ఐటి మంత్రి లోకేశ్ జగన్ ను టార్గెట్ చేశారు. జగన్ కేసుల మాఫీ కోసం బిజెపితో చేతులు కలిపారని ఆరోపించారు. జగన్ కు ఓటు వేస్తే బిజెపికి ఓటు వేసినట్లే నని లోకేశ్ ప్రచారం ప్రారంభించారు. మహానాడులో టిడిపి నేతల ప్రసంగాల తీరును గమనిస్తే ఎన్నికల శంఖారావాన్ని పూరించినట్లు ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories