పొత్తులపై కాంగ్రెస్ లో అయోమయం...పొత్తులుంటాయని తేల్చి చెప్పిన రాహుల్

x
Highlights

తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్, టిడిపి కలసి అడుగులేస్తాయా? పొత్తులుంటాయని రాహుల్ తేల్చేయడంతో అది టిడిపితోనేనని రాష్ట్ర నేతలు అన్వయించుకుంటున్నారు. ఏపి...

తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్, టిడిపి కలసి అడుగులేస్తాయా? పొత్తులుంటాయని రాహుల్ తేల్చేయడంతో అది టిడిపితోనేనని రాష్ట్ర నేతలు అన్వయించుకుంటున్నారు. ఏపి వరకూ టిడిపి వ్యూహంపై స్పష్టత రాకపోయినా తెలంగాణలో మాత్రం కాంగ్రెస్, టిడిపి కలిసే అడుగేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.

తెలంగాణలో ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలన్న పట్టుదలతో ఉన్న కాంగ్రెస్ ఎవరితోనైనా జత కలవడానికి రెడీ అంటోందా?దీనికి అవుననే సమాధానం వస్తోంది. 2019 ఎన్నికల్లో పొత్తులుంటాయని, రెడీగా ఉండాలనీ రాహుల్ గాంధీ తెలంగాణ నేతలకు సిగ్నల్ ఇచ్చారు. ఇంత‌కీ కాంగ్రెస్ పార్టీ ఎవ‌రితో పొత్తు పెట్టుకుంటుంది? ఢీల్లి వేదికగా జరిగిన, జరుగుతున్న రాజకీయ పరిణామాలు రాష్ట్ర రాజకీయ పరిణామాలపై ప్రభావం చూపుతున్నాయి. ఇటీవల పార్లమెంటులో అవిశ్వాసం సందర్భంగా కాంగ్రెస్ అధిష్టానం టీడీపీ కి సహకరించింది ఏపి టిడిపి పెట్టిన అవిశ్వాస తీర్మానానికి కాంగ్రెస్ మద్దతు ప్రకటించింది. దాంతో ఇక భవిషేత్తులో టీడీపీ తో పొత్తు ఉంటుందనే చర్చ జోరుగా సాగుతోంది.

మరో వైపు ఏపీ రాజకీయం రసవత్తరంగా మారుతోంది. తెలుగు దేశం పార్టీ ఇప్పటి వరకూ ఒంటరి ఎన్నికలను ఎదుర్కొన్న సందర్భం లేదు ప్రతీ ఎన్నికలకు ఏదో ఓ పార్టీతో పొత్తుతో నే అడుగులేసింది. గత ఎన్నికల్లో అటు బిజెపి, ఇటు పవన్ ను కలుపుకుని వెళ్లి గెలుపు సాధించింది. కానీ ఈసారి ఆ పరిస్థితి లేదు మారిన రాజకీయ సమీకరణల్లో టిడిపి ఒంటరిదైపోయింది మరోవైపు జనసేన కూడా ఎన్నికల బరిలోకి దిగుతుండటంతో పొత్తు లేకుండా పోటీకి వెడితే ఏమవుతుందో నన్న అనుమానం టిడిపి నేతల్లో ఉంది
ఏపి సంగతెలా ఉన్నా తెలంగాణలో పార్టీని బతికించుకోడానికి పొత్తు ఒక మార్గంగా టిడిపి సీనియర్లు ఆలోచిస్తున్నారు.

ఇక తెలంగాణలో టిఆరెస్ పై పట్టు సాధించాలన్న తపన కాంగ్రెస్ ది అక్కడ టిడిపి చాలా బలహీనపడిపోయింది ఎన్నికల్లో టీ-టిడిపి ఒంటరిగా పోటీ చేసే పరిస్థితి కనిపించడం లేదు. కేసిఆర్ ను ఎదుర్కొనడానికి భావ సారూప్యం కలిగిన పార్టీలు కలసి కూటమిగా పోటీ చేస్తే తప్పు లేదన్న ఆలోచనను టి- టిడిపి నేతలు చేస్తున్నారు ఇలాంటి సమయంలోనే అటు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ అదే అభిప్రాయంతో ఉన్నారు టిడిపి, కాంగ్రెస్ జతకలిసి ఇటు తెలంగాణలో పోటీకి దిగాలన్నది దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. ఈ పొత్తు కుదిరితే అటు ఏపీలోనూ కొనసాగుతుందన్న అభిప్రాయాలు వెలువడుతున్నాయి. ఇలాంటి పరిస్థితిలో రానున్న సార్వత్రిక ఎన్నికలో టీడీపీ కాంగ్రెస్ తో కలిసి వస్తుందని సీనియర్ నాయకుడు సర్వే సత్యనారాయణ బహిరంగంగానే వ్యాఖ్యాలు కలకలం సృష్టించారు.

సర్వే మాటలు ఇలా ఉంటే టిడిపితో పొత్తు అంటే పార్టీలో చేరే వారు కూడా చేరరని ఇలాంటి వ్యాఖ్యలు పార్టీ కి నష్టం చేకూరుస్తాయని మరికొందరు అంటున్నారు. ఇక ఏకంగా పీసీసీ అధ్యక్షుడు, పార్టీ లో సీనియర్ నాయకులు పొత్తుల నిర్ణయం హై కమాండ్ తీసుకుంటుందని అంటున్నారు. మొత్తానికి పొత్తుల‌తో వెళ్లాలా లేక‌ ఒంట‌రిగా వెళ్లాలా అనేది ఇంకా కాంగ్రెస్ పార్టీలో క్లారిటీ రాలేదు. కానీ తెలంగాణ కాంగ్రెస్, టిడిపి మధ్య మాత్రం దీనిపై రహస్య మంతనాలు సాగుతున్నాయని, కొంత కసరత్తు జరుగుతోందనీ వార్తలొస్తున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories