టీడీపీలోకి ఫిరాయిస్తే రూ. 40 కోట్లు

టీడీపీలోకి ఫిరాయిస్తే రూ. 40 కోట్లు
x
Highlights

తాను తెలుగుదేశం పార్టీలో చేరితే రూ. 40 కోట్లు ఇస్తామని ఆశ పెడుతున్నారని చిత్తూరు జిల్లా పూతలపట్టు ఎమ్మెల్యే, వైకాపా నేత డాక్టర్ ఎం సునీల్ కుమార్ సంచలన...

తాను తెలుగుదేశం పార్టీలో చేరితే రూ. 40 కోట్లు ఇస్తామని ఆశ పెడుతున్నారని చిత్తూరు జిల్లా పూతలపట్టు ఎమ్మెల్యే, వైకాపా నేత డాక్టర్ ఎం సునీల్ కుమార్ సంచలన విమర్శలు చేశారు. ఒప్పుకోకపోతే తప్పుడు కేసులు పెడతామని కూడా బెదిరించారని ఆయన ఆరోపించారు. చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలోని రొంపిచెర్ల మండలం మోటుమల్లెల పంచాయతీ బండమీద చల్లావారిపల్లెలో మంగళవారం జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. టీడీపీ వారికి ఎమ్మెల్యేల కొనుగోలుపై ఉన్న శ్రద్ధ రాష్ట్రాభివృద్ధి, ప్రజల సంక్షేమంపై లేదని ఆయన దుయ్యబట్టారు. ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా వెరవనని, తాను ఎప్పటికీ తన గురువు, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెంటే ఉంటానని స్పష్టం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories