తెలుగు రాష్ట్రాల్లో ఉక్కు పరిశ్రమల ఏర్పాటుపై కేంద్రం స్పందన

తెలుగు రాష్ట్రాల్లో ఉక్కు పరిశ్రమల ఏర్పాటుపై కేంద్రం స్పందన
x
Highlights

తెలుగు రాష్ట్రాల్లో ఉక్కు కర్మాగారాల ఏర్పాటుకు ఎన్‌డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి బీరేంద్రసింగ్ స్పష్టం చేశారు. కడపలో ఉక్కు...

తెలుగు రాష్ట్రాల్లో ఉక్కు కర్మాగారాల ఏర్పాటుకు ఎన్‌డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి బీరేంద్రసింగ్ స్పష్టం చేశారు. కడపలో ఉక్కు కర్మాగారం కోసం గత ఎనిమిది రోజులుగా దీక్ష చేస్తున్న విషయాన్ని టీడీపీ ఎంపీలు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. తెలుగు రాష్ట్రాల్లో ఉక్కు పరిశ్రమల ఏర్పాటుపై ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు నిన్నే సమీక్ష నిర్వహించారని టీడీపీ ఎంపీలకు బీరేంద్రసింగ్ వివరించారు. విభజన హామీలపై సుప్రీంకోర్టులో కేసు నడుస్తోందని వీటిపై కేంద్రం కూడా అఫిడవిట్ దాఖలు చేసిందని తెలియజేశారు. ఉక్కు కర్మాగారాల ఏర్పాటుకు టాస్క్ ఫోర్స్ వేగవంతంగా పనిచేస్తోందని రెండు రాష్ట్ర ప్రభుత్వాలపై దీనిపై మరింత స్పష్టత ఇవ్వాలన్నారు. నివేదిక రాగానే నిర్ధిత కాలవ్యవధితో ఉక్కు కర్మాగారాలను నిర్మిస్తామంటూ హామి ఇచ్చారు.

Show Full Article
Print Article
Next Story
More Stories