logo
జాతీయం

రాజ్‌‌నాథ్‌ను కలిసిన టీడీపీ ఎంపీలు

రాజ్‌‌నాథ్‌ను కలిసిన టీడీపీ ఎంపీలు
X
Highlights

టీడీపీ ఎంపీలు కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ను కలిశారు. సాయంత్రం 4 గంటల సమయంలో ఎంపీలు రాజ్‌నాథ్‌ను...

టీడీపీ ఎంపీలు కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ను కలిశారు. సాయంత్రం 4 గంటల సమయంలో ఎంపీలు రాజ్‌నాథ్‌ను కలిశారు. విభజన చట్టంలోని అంశాలపై రాజ్‌నాథ్‌తో చర్చించారు. ఏడాదిలోగా విభజన హామీలన్నీ అమలయ్యేలాగా చొరవ తీసుకోవాలని టీడీపీ ఎంపీలు రాజ్‌నాథ్‌ను కోరారు. ఈ భేటీలో కేంద్రమంత్రులు అశోకగజపతిరాజు, సుజనా చౌదరి, ఎంపీలు తోట నరసింహం, నిమ్మల కిష్టప్ప, రామ్మోహన్‌ నాయుడు పాల్గొన్నారు. కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి జరిగిన అన్యాయంపై చర్చించనున్నారు. ఎంపీలందరూ సమావేశాల్లో పాల్గొనాల్సిన అవసరం లేదని, ఐదుగురు మాత్రమే సమావేశాల్లో పాల్గొంటే సరిపోతుందని సీఎం చంద్రబాబు ఎంపీలకు సలహా ఇచ్చారు. ఈ మేరకు ఈ ఐదుగురితో ఓ కమిటీ కూడా ఏర్పాటు చేశారు. ఈ కమిటీనే కేంద్ర మంత్రులతో చర్చలు జరుపుతుందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.

ఉభయసభల్లో ఈ ఐదుగురు ఎంపీలు ఉండేందుకు వీలుగా ఈ కమిటీ వేసినట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం జరుగుతున్న సమావేశం ప్రధాన్యత సంతరించుకుంది. ఆదివారం టీడీపీపీ సమావేశం తర్వాత రాజ్‌నాథ్, చంద్రబాబుతో ఫోన్‌లో మాట్లాడారు. పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దని, బాబుకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఇది ప్రధాని మాటగా పరిగణించాలని సూచించారు. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకుందామని సీఎంకు రాజ్‌నాథ్ సలహా ఇచ్చారు. రాజ్‌నాథ్ చెప్పినట్లుగానే ఈ రోజు ఆయన టీడీపీ ఎంపీలకు అపాయింట్‌మెంట్ ఇచ్చారు. అందులోభాగంగా ఎంపీలు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

Next Story