ఆ టీఆర్ఎస్ నేత తాగుబోతు సన్నాసి...రాత్రయితే ఫుల్లుగా తాగి కేసీఆర్‌ కాళ్లు ఒత్తుతాడు

ఆ టీఆర్ఎస్ నేత తాగుబోతు సన్నాసి...రాత్రయితే ఫుల్లుగా తాగి కేసీఆర్‌ కాళ్లు ఒత్తుతాడు
x
Highlights

టీఆర్‌ఎస్‌ ఎంపీ కే. కేశవరావు(కేకే)ను తీవ్ర పదజాలంతో దూషించారు టీడీపీ ఎంపీ టీజీ వెంకటేశ్‌. శుక్రవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన సంచలన వ్యాఖ్యలు...

టీఆర్‌ఎస్‌ ఎంపీ కే. కేశవరావు(కేకే)ను తీవ్ర పదజాలంతో దూషించారు టీడీపీ ఎంపీ టీజీ వెంకటేశ్‌. శుక్రవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.‘‘కేకే పిచ్చోడు. తాగుబోతు సన్నాసి. పిచ్చోళ్లకు అంతా పిచ్చోళ్లలానే కనిపిస్తారు’’ అంటూ టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత, రాజ్యసభ ఎంపీ కేశవరావును టీడీపీ ఎంపీ టీజీ వెంకటేశ్‌ దూషించారు. తెలంగాణ ఉద్యమంలో కేకే ఎక్కడున్నారని ప్రశ్నించారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం తెలంగాణ సీఎం కేసీఆర్‌ పోరాటం చేయాలని, లేకపోతే, టీఆర్‌ఎ్‌సకు ఓటు వేయవద్దంటూ సీమాంధ్రులకు పిలుపు ఇస్తామని టీజీ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. వాటిపై స్పందించిన కేకే.. టీజీ ఓ పిచ్చోడంటూ విమర్శలు గుప్పించారు. ఆయన వ్యాఖ్యలకు కౌంటర్‌గా టీజీ వెంకటేశ్‌ శుక్రవారం ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు. కేకేపై తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. గతంలో పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కేశవరావును కాంగ్రెస్‌ కార్యకర్తలు పిచ్చోడనే వారని విమర్శించారు. నాలుగైదు భాషలు కలిపి పిచ్చి భాష మాట్లాడుతుంటే అందరూ తలగోక్కునే వాళ్లని ఎద్దేవా చేశారు. అలాంటి కేకే తనకు మతిభ్రమించిందని అంటున్నారని, ఆయనకే పిచ్చి విజృంభించిందని మండిపడ్డారు. ‘‘మేం రాయలసీమ వాళ్లము రా.. మా దేహంలో రక్తం ఉంది. నీ దేహంలో సారాయి ఉంది. రాత్రి అయితే ఫుల్లుగా తాగి కేసీఆర్‌ కాళ్లు ఒత్తుతూ ఉంటావు. నీకు ఏం పని ఉంది? ఏ ఉద్యమంలో పాల్గొన్నావు నువ్వు..?’’ అని నిలదీశారు. కేసీఆర్‌ ఉద్యమాన్ని నడిపారని, ఆ ఉద్యమంలో కేకే ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు.

‘‘కేకే ముఖానికి రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ పదవి అవసరమా? ఆయనకు మెదడు మోకాళ్లలో ఉంటుంది కాబట్టే నా మాటలు పిచ్చివిగా అనిపించాయి. ‘‘కేకేను రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా ప్రతిపాదిస్తే ప్రతిపక్ష పార్టీలు అంగీకరించబోవు. నువ్వు డిప్యూటీ చైర్మన్‌ అవుతావా...? నీ ముఖం.. నిన్ను డిప్యూటీ చైర్మన్‌ చేస్తే.. ఆ రోజే నేను రాజ్యసభకు రాజీనామా చేసి పోతా. ఎందుకు ఉండాలి అటువంటి పనికిమాలినవాడు ఉన్నప్పుడు’’ అని ధ్వజమెత్తారు. అసలు నేనన్నదాంట్లో తప్పేముంది? విభజనతో తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌ కోసం తెలంగాణ కూడా మాట్లాడాల్సిందే. ఎందుకంటే 60 ఏళ్ల ఉమ్మడిగా ఉన్నాం. ఎవరు అవునన్నా, కాదన్నా హైదరాబాద్‌ నిర్మాణంలో ఆంధ్రులు, రాయలసీమ వాసుల కష్టం కూడా ఉంది. గతంలో కేటీఆర్‌, కవితలు కూడా ఏపీ హక్కుల కోసం మాట్లాడటం మనం చూశాం. ఇప్పుడీ కేకే నన్ను తిట్టడంలో ఏమైనా అర్థం ఉందా? కేకే.. నీకు వ్యవహారం తెలియకుంటే హరీశ్‌, కవిత, కేటీఆర్‌ల్ని చూసి నేర్చుకో, లేదా, మా మంత్రి నారా లోకేశ్‌ దగ్గరికి రా’’ అని టీజీ వ్యాఖ్యానించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories