సీఎంతో మాట్లాడా.. అంతా సమసిపోయింది: జేసీ

సీఎంతో మాట్లాడా.. అంతా సమసిపోయింది: జేసీ
x
Highlights

టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి ఇవాళ సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు. వీరి సమావేశం దాదాపు 20నిమిషాల పాటు సాగింది. సీఎంతో ఏకాంతంగా చర్చించిన జేసీ వివిధ...

టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి ఇవాళ సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు. వీరి సమావేశం దాదాపు 20నిమిషాల పాటు సాగింది. సీఎంతో ఏకాంతంగా చర్చించిన జేసీ వివిధ సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. అవిశ్వాసానికి గైర్హాజరు రాజీనామా వంటి ప్రకటనలపై చంద్రబాబుకు వివరించినట్లు తెలిసింది. అయితే ఇలాంటి ప్రకటనలు ఇకపై చేయవద్దంటూ జేసీకి చంద్రబాబు హితబోధ చేసినట్లు సమాచారం.

సీఎంతో భేటీ అనంతరం తర్వాత సచివాలయానికి వచ్చిన జేసీ దివాకర్ రెడ్డి విలేకరులతో సమావేశం వివరాలు చెప్పడానికి నిరాకరించారు. అంతా సమసిపోయిందని, తాను పార్లమెంట్‌కు హాజరవుతున్నానని తెలిపారు. మోడీ ప్రధానిగా ఉన్నంతవరకూ విభజన హామీలు అమలుకావని అప్పటివరకూ తమ పోరాటం కొనసాగించాల్సిందేనని వ్యాఖ్యానించారు. సీడబ్ల్యూసీ సమావేశంలో ప్రత్యేక హోదాపై తీర్మానం ఒట్టి మాటేనన్న జేసీ అధికారంలో ఉండి చేయలేనిది ఇప్పుడేం చేస్తారంటూ ప్రశ్నించారు. రాజకీయాల పరిస్థితి బాగాలేదని జీవితంలో కష్టాలు సుఖాలు మామూలేనని జేసీ దివాకర్ రెడ్డి అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories