బీజేపీకి ప్రజలే తగిన బుద్ధి చెబుతారు

x
Highlights

ప్రతిపక్ష పార్టీలపై కక్ష సాధించుకునేందుకు సీబీఐ, ఈడీ, ఐటీ లాంటి సంస్థలను కేంద్రం ఉపయోగించడం దారుణమన్నారు టీడీపీ ఎంపీ సీఎం రమేష్. ఇవాళ తిరుమల...

ప్రతిపక్ష పార్టీలపై కక్ష సాధించుకునేందుకు సీబీఐ, ఈడీ, ఐటీ లాంటి సంస్థలను కేంద్రం ఉపయోగించడం దారుణమన్నారు టీడీపీ ఎంపీ సీఎం రమేష్. ఇవాళ తిరుమల శ్రీవారిని దర్శనానికి వచ్చిన ఆయన విఐపీ విరామ సమయంలో స్వామివారిని దర్శించుకున్నారు. కడపలో స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలపడంతో మొక్కులు చెల్లించుకునేందుకు వచ్చినట్టు ఆయన చెప్పారు. ఎన్డీయే నుంచి బయటకు వచ్చామని, బీజేపీకి వ్యతిరేకంగా స్థానిక పార్టీలను చంద్రబాబు ఏకం చేస్తున్నాడని కేంద్రం ఇలా చేయడం సరికాదన్నారు. ఇదంతా ప్రజలు గమనిస్తున్నారని, ప్రజలే బీజేపీకి తగిన బుద్ధి చెబుతారని అన్నారు సీఎం రమేష్.

Show Full Article
Print Article
Next Story
More Stories