పంచాయతీరాజ్ ఏఈపై ఎమ్మెల్యే బూతు పురాణం
X
Highlights
విజయనగరం జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో గజపతినగరం ఎమ్మెల్యే కేఏ నాయుడు బూతుపురాణం అందుకున్నారు. పార్వతీపురం ...
arun31 Dec 2017 12:56 PM GMT
విజయనగరం జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో గజపతినగరం ఎమ్మెల్యే కేఏ నాయుడు బూతుపురాణం అందుకున్నారు. పార్వతీపురం పంచాయతీ రాజ్ ఏఈ సత్యనారాయణమూర్తిని బండ బూతులు తిట్టారు. పంచాయతీరాజ్ క్వాలిటీ కంట్రోల్ బిల్లులు చెల్లించడం లేదన్న గజపతినగరం ఎమ్మెల్యే కేఏ నాయుడు బయటికి రా నీ సంగతి తేలుస్తానంటూ వార్నింగ్ ఇచ్చారు. పార్వతీపురం పంచాయతీ రాజ్ ఏఈ సత్యనారాయణమూర్తిని బెదిరించిన ఎమ్మెల్యే తాట తీస్తానంటూ ఆగ్రహం వ్యక్తంచేశాడు. మంత్రి సుజయకృష్ణరంగారావు, కలెక్టర్ వివేక్ యాదవ్ ముందే ఎమ్మెల్యే బండ బూతులు తిట్టినా చూస్తూ మిన్నకుండిపోయారు.
Next Story