వైసీపీకి మరో ఎమ్మెల్యే..

nanireddy
Updated on: 24 Dec 2018 4:34 PM IST
వైసీపీకి మరో ఎమ్మెల్యే..
X

ఏపీలో మరో ఐదు నెలల్లో ఎన్నికలు జరుగుతాయనగా ప్రతిపక్షం వైసీపీకి అదనంగా మరో ఎమ్మెల్యే కలిసివచ్చాడు. ఎన్నికల అఫిడవిట్‌లో తప్పుడు సమాచారం ఇచ్చారన్న అభియోగాలు నిజమని రుజువు కావడంతో.. అనంతపురం జిల్లా మడకశిర ఎమ్మెల్యే మసాలా ఈరన్న ఎన్నిక చెల్లదంటూ ఇటీవల హైకోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెల్సిందే. అయితే ఈ తీర్పును మసాలా ఈరన్న సవాల్ చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. కానీ అక్కడ కూడా ఈరన్నకు చుక్కెదురైంది. సుప్రీం కోర్టు సైతం హైకోర్టు తీర్పును సమర్ధించింది. దాంతో మడకశిర అసెంబ్లీ స్థానం ఖాళీ కావడంతో.. 2014 ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచిన వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ఎం.తిప్పేస్వామి మడకశిర ఎమ్మెల్యేగా కొనసాగుతారని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ రకంగా వైసీపీకి అదనంగా మరో ఎమ్మెల్యే కలిసివచ్చినట్టయింది.

nanireddy

nanireddy

Next Story