హిందూపురంలో బాలయ్య బ్యాటింగ్

X
Highlights
అనంతపురం జిల్లా హిందూపురంలో టాలీవుడ్ హీరో, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సందడి చేశారు. హిందూపురంలోని...
arun30 Dec 2017 8:41 AM GMT
అనంతపురం జిల్లా హిందూపురంలో టాలీవుడ్ హీరో, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సందడి చేశారు. హిందూపురంలోని ఎంజీఎం మైదానంలో తన తల్లి పేరుతో ఏర్పాటు చేసిన నందమూరి బసవతారకరామా మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆటగాళ్లను పరిచయం చేసుకున్న బాలయ్య.. అనంతరం బ్యాట్‌తో ఢిఫెన్స్ షాట్స్ ఆడుతూ అభిమానులను అలరించారు. ఎప్పుడూ సినిమాల్లో డైలాగ్‌లతో మెప్పించే బాలకృష్ణ తమ వద్ద బ్యాట్ పట్టుకునే సరికి అభిమానులు ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. బాలయ్యను చూసేందుకు అభిమానులు మైదానానికి తరలివచ్చారు.
Next Story