టీడీపీ నేతల దుశ్శాసన పర్వం.. దళిత మహిళను వివస్త్రను చేసిన వైనం

టీడీపీ నేతల దుశ్శాసన పర్వం.. దళిత మహిళను వివస్త్రను చేసిన వైనం
x
Highlights

ఆడదని ఆగలేదు మహిళని మన్నించలేదు బలహీనులని బరితెగించారు పేదవారేనని పేట్రేగిపోయారు విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గంలో దుశ్శాసన పర్వం వెలుగు చూసింది...

ఆడదని ఆగలేదు మహిళని మన్నించలేదు బలహీనులని బరితెగించారు పేదవారేనని పేట్రేగిపోయారు విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గంలో దుశ్శాసన పర్వం వెలుగు చూసింది జెర్రిపోతుల పాలెంలోని భూ తగాదాలో మహిళపై కొందరు వ్యక్తులు రాక్షసంగా ప్రవర్తించారు సభ్యసమాజం తలదించుకునేలా దళిత మహిళను వివస్త్రను చేసి దుశ్శాసన పర్వానికి తెరతీశారు.

సర్వే నెంబర్ 77 లో ఖాళీ గా వున్న ఢీఫారం పట్టాల స్తలం ఉంది. కొంతకాలం గా ఈ స్థలం లో దళితులు నివాసాలు ఏర్పర్చుకున్నారు ఇప్పుడు అదే స్థలం ను ఎన్టిఆర్ గృహ నిర్మాణ పథకం లో పేదలకు. ప్రభుత్వం ఇళ్ళు నిర్మించడానికి కెటాయించారు లబ్థిదారులు గృహనిర్మాణ పనుల నిమిత్తం స్థలం లోనికి వెళ్లడం తో స్థానికులకు, దళితులకు మధ్య ఘర్షణ జరిగింది ఇంతలో అక్కడ కు చేరుకున్న స్థానిక నేతలు గృహనిర్మాణ లబ్థిదారులకు వత్తాసు పలకడం తో పాటు దళితులను ఖాళీ చేయించే ప్రయత్నం చేసారు.

దీంతో అక్కడ నివాసం ఉంటున్న మహిళలు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు తమను అడ్డుకున్నారన్న నెపంతో మహిళ అని చూడకుండా దుస్తులు చింపేసి ఈడ్చేశారు. బండ బూతులు తిడుతూ ఇతర దళితులను వెంటాడి కొట్టారు. ఈ ఘటనపై బాధితులు పెందుర్తి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories