టీడీపీ నేత బాగోతాన్ని బయటపెట్టిన భార్య

టీడీపీ నేత బాగోతాన్ని బయటపెట్టిన భార్య
x
Highlights

ఏడాదిగా భర్త తనను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడంటూ... తేలప్రోలు టీడీపీ మహిళా సర్పంచ్‌ హరిణి గన్నవరం పోలీసులను ఆశ్రయించింది. కృష్ణా జిల్లా తెలుగు...

ఏడాదిగా భర్త తనను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడంటూ... తేలప్రోలు టీడీపీ మహిళా సర్పంచ్‌ హరిణి గన్నవరం పోలీసులను ఆశ్రయించింది. కృష్ణా జిల్లా తెలుగు యువత నాయకుడుగా పనిచేస్తున్న యతేంద్ర తనను శారీరకంగా హింసిస్తూ గాయపరుస్తున్నాడని హరిణి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఒంటిపై గాయాలున్న ఫొటోలను ఫేస్‌ బుక్‌లో పోస్ట్‌ చేసిన హరిణి... ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. సీఐ మీద నా భర్త యతేంద్ర ఒత్తిడి తీసుకువచ్చి నాతో కేసు వాపస్‌ తీసుకునేలా చేశారు. న్యాయం జరగదని భావించి ఇలా అందరికీ నా భాద చెప్పుకుంటున్నాను. ఇక నా భర్త నన్ను ప్రాణాలతో ఉంచుతాడనే ఆశ నాకు లేదు. కనీసం పిల్లల ప్రాణాలైనా కాపాడండి. ఇలాంటి పరిస్థితి మరొక ఆడపడుచుకి రాకుండా చూడండి’ అని తన ఫేస్‌బుక్‌ పోస్ట్‌లో బాధితురాలు హరిణికుమారి కోరారు.

‘టీడీపీ యూత్‌ లీడర్ ఓ బుకీ, పేకాటరాయుడు, అమ్మాయిలతో సంబంధాలు కొనసాగిస్తాడు. ఇలాంటి రాజకీయనాయకుల వల్ల మాకు పోలీస్‌స్టేషన్లలో కూడా న్యాయం జరగడం లేదు. ప్రభుత్వానికి చేరేంతవరకు ఈ పోస్టును షేర్‌ చేయండి. బాధితురాలు మీ సోదరి’ అని హరిణికుమారి మరో పోస్ట్‌లో భర్త వ్యసనాలు, దురలవాట్లను బయటపెట్టారు. భర్త ఫొటోను షేర్‌ చేస్తూ కనబడటం లేదని, ఎవరికైనా కనిపిస్తే తనకు తెలియజేయాలని బాధిత మహిళా సర్పంచ్‌ కోరారు.

Show Full Article
Print Article
Next Story
More Stories