టీడీపీకి షాక్.. వైసీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే...

టీడీపీకి షాక్.. వైసీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే...
x
Highlights

హిందూపురం టీడీపీ మాజీ ఎమ్మెల్యే అబ్దుల్ ఘనీ టీడీపీకి రాజీనామా చేశారు. తాను వ్యక్తిగత కారణాలతో పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు పార్టీ అధినేత...

హిందూపురం టీడీపీ మాజీ ఎమ్మెల్యే అబ్దుల్ ఘనీ టీడీపీకి రాజీనామా చేశారు. తాను వ్యక్తిగత కారణాలతో పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు పార్టీ అధినేత చంద్రబాబుకు లేఖరాశారు. అయితే, టీడీపీకి రాజీనామా చేసిన ఘనీ వెంటనే వైసీపీలో చేరిపోయారు. హిందూపురం శాసనసభకు 2009లో టీడీపీ తరపున పోటీ చేసి ఎమ్మెల్యే అయిన అబ్దుల్ ఘనీ.. 2014లో బాలకృష్ణ కోసం సీటు వదులుకున్నారు. పార్టీ నిర్ణయమే శిరోధార్యమని చెప్పిన అబ్దుల్ ఘనీ.. నాలుగేళ్ల వరకు టీడీపీలోనే కొనసాగారు. శ్రీకాకుళంలో పాదయాత్రలో ఉన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిసిన ఆయన జగన్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. తెలుగుదేశం పార్టీలో 30 ఏళ్లుగా పనిచేసిన తనకు సరైన ప్రాధాన్యత లేదని ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు అబ్దుల్ ఘని నాలుగున్నరేళ్లలో మైనారిటీలకు చంద్రబాబు చేసింది ఏమీలేదని ఆరోపంచిన ఆయన ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్ కల్పించిన ఘనత వైఎస్ రాజశేఖరరెడ్డిదే అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories