అమరావతిలో సైకిల్‌ యాత్ర

arun
By arun
Updated on: 24 Dec 2018 1:16 PM IST
అమరావతిలో సైకిల్‌ యాత్ర
X

తెలుగు వారిని దెబ్బతీయాలని చూస్తే ఖబడ్డార్ అంటూ సీఎం చంద్రబాబు ప్రధాని నరేంద్రమోడీని హెచ్చరించారు. ప్రత్యేక హోదా సాధన కోసం ఎంపీలు చేస్తున్న పోరాటానికి సంఘీభావంగా చేపట్టిన సైకిల్ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. వెంకటపాలెం నుంచి అసెంబ్లీ వరకు సైకిల్ యాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించిన ఆయన తెలుగుదేశంపై కుట్రలు కొత్తకాదన్నారు. ఇందిరా గాంధీ మెడలు వంచిన చరిత్ర తమదన్నారు. తెలుగు వారికి అన్యాయం చేసిన సోనియా గాంధీని రాష్ట్ర ప్రజలు మట్టికరిపించారన్న చంద్రబాబు రాష్ట్రానికి అన్యాయం చేస్తే నరేంద్ర మోడీకి అదే గతి పడుతుందంటూ హెచ్చరించారు.

arun

arun

Next Story