ఐటీ దాడులపై ఏపీ మంత్రుల ఆందోళన

x
Highlights

టీడీపీ సమన్వయ కమిటీ భేటీలో ఓటుకు నోటు అంశంపై చర్చ జరిగింది. కేంద్రం ఆదేశాల మేరకే తెలంగాణలో ఐటీ దాడులు జరిగాయని మంత్రులు ప్రస్తావించారు. తెలంగాణ...

టీడీపీ సమన్వయ కమిటీ భేటీలో ఓటుకు నోటు అంశంపై చర్చ జరిగింది. కేంద్రం ఆదేశాల మేరకే తెలంగాణలో ఐటీ దాడులు జరిగాయని మంత్రులు ప్రస్తావించారు. తెలంగాణ ఏసీబీనే ఓటుకు నోటు కేసును దర్యాప్తు చేయాల్సిందిగా కేంద్రాన్ని కోరిందని ఓ మంత్రి ప్రస్తావించారు. ఏపీ విషయంలోనూ ఇదే తరహా దాడులు చేసే అవకాశం ఉందన్నారు మరో మంత్రి. సీఎం మీదే కాకుండా మంత్రులనూ టార్గెట్ చేసేలా కేంద్రం కుట్రలు చేస్తోందన్న ప్రచారం జరుగుతోందని ఓ సీనియర్ నేత తెలిపారు.


జాతీయ రాజకీయాలు, పరిణామాలపై టీడీపీ సమన్వయ కమిటీ లో కీలక చర్చ జరిగింది. ప్రధాని మోడీకి దగ్గరగా ఉన్న సీఎంలు ఎవరు అన్న అంశంపై చర్చించారు. కేసీఆర్ లాంటి సీఎంలు మోడీకి దగ్గర అవుతున్నారని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. తమను అడ్డుకోవడం కోసం కొందరు రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. పవన్ ,జగన్ వైఖరులపై ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్లాలని సమన్వయ కమిటీ భేటి చంద్రబాబు సూచించారు.

టీడీపీ సమన్వయ కమిటీ భేటీలో నేతలు, మంత్రులు జాతీయ రాజకీయాలపై చర్చించారు. జాతీయ స్థాయిలో బీజేపీయేతర పార్టీలను ఒక్కతాటి మీదకు తెచ్చేలా ప్రణాళికతో ఉన్నామని చంద్రబాబు తెలిపారు. జాతీయ రాజకీయాలపై ఫోకస్ పెడుతున్నామే తప్ప జాతీయ స్థాయిలో అధికారం ముఖ్యం కాదని బాబు చెప్పారు.
చంద్రబాబు ప్రధాని అవుతారన్న కామెంట్లను ఎవ్వరూ చేయొద్దంటూ చంద్రబాబు, నేతలను, మంత్రులను ఆదేశించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories