ఉపాధ్యాయ వృత్తికి రాజీనామా.. వైసీపీలో చేరిక

nanireddy
Updated on: 24 Dec 2018 4:07 PM IST
ఉపాధ్యాయ వృత్తికి రాజీనామా.. వైసీపీలో చేరిక
X

ఎన్నికల సమయం ముంచుకొస్తున్న కొద్ది వివిధ పార్టీలలోకి వలసలు ఊపందుకున్నాయి. వైసీపీ కార్యకర్తలు టీడీపీలోకి, టీడీపీ కార్యకర్తలు వైసీపీలోకి చేరుతున్నారు. ఈ క్రమంలో నిన్న జగన్ ప్రజాసంకల్పయాత్రలో టీడీపీ, కాంగ్రెస్‌ పార్టీల నుంచి పలువురు నేతలు వైసీపీలో చేరారు. అరకు నియోజకవర్గంలోని అరకువేలీ, హుకుంపేట, అనంతగిరి మండలాలకు చెందిన టీడీపీ, కాంగ్రెస్‌కు చెందిన పలువురు మాజీ సర్పంచ్‌లు, నాయకులు జగన్ సమక్షంలో ఆ పార్టీలో చేరారు. అలాగే అరకు నియోజకవర్గం కొంతిలి గ్రామానికి చెందిన ఏపీ గిరిజన సంక్షేమశాఖ ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడు రేగం మత్యలింగం తన ఉపాధ్యాయ ఉద్యోగానికి రాజీనామా చేసి జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. కాగా ప్రస్తుతం కురుపాం నియోజకవర్గంలో జగన్ పాదయాత్ర సాగుతోంది. నేడు కురుపాంలో ఆ పార్టీ భహిరంగసభను ఏర్పాటు చేసింది.

nanireddy

nanireddy

Next Story