టీడీపీ, కాంగ్రెస్ పొత్తుపై ఏపీలో విస్తృత చర్చ...వచ్చే ఎన్నికల్లో ....

టీడీపీ, కాంగ్రెస్ పొత్తుపై ఏపీలో విస్తృత చర్చ...వచ్చే ఎన్నికల్లో ....
x
Highlights

కాంగ్రెస్‌తో టీడీపీ పొత్తుపై ఆంధ్ర ప్రదేశ్‌లో వాడి వేడి చర్చ జరుగుతోంది. తెలంగాణలో మహా కూటమి ప్రయోగం విజయవంతం కాకపోవడం, కాంగ్రెస్, టీడీపీ పొత్తుపై...

కాంగ్రెస్‌తో టీడీపీ పొత్తుపై ఆంధ్ర ప్రదేశ్‌లో వాడి వేడి చర్చ జరుగుతోంది. తెలంగాణలో మహా కూటమి ప్రయోగం విజయవంతం కాకపోవడం, కాంగ్రెస్, టీడీపీ పొత్తుపై విమర్శలు రావడంతో ఏపీలో రెండు పార్టీల మధ్య పొత్తు ఉంటుందా లేదా అనే చర్చ మొదలైంది. కాంగ్రెస్, టీడీపీ పొత్తుపై రెండు పార్టీల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నా వచ్చే ఎన్నికల్లో కలసి సాగడం తధ్యమనే మాటే ఎక్కువగా వినిపిస్తోంది. ఇది టీడీపీ , కాంగ్రెస్ నేతల్లో కొందరి వాదన. ప్రత్యేక హోదా ఇవ్వని మోడీని ఓడించడానికి , దేశ ప్రయోజనాలకే కాంగ్రెస్ ‌తో స్నేహం చేస్తున్నామని కొందరు ఏపీ టీడీపీ నేతలు అంటుంటే తెలుగు దేశంతో పొత్తు కాంగ్రెస్‌ ను నిలువునా ముంచేస్తుందని కొందరు హస్తం నేతలు బాధపడుతున్నారు. 2019 ఎన్నికల్లో ఏపీలో టీడీపీ కాంగ్రెస్ పొత్తుపై అగ్రనేతలు ఎవరూ ప్రకటనలు చేయకపోయినా తెలంగాణ ఫలితాలు వచ్చాక ఈ చర్చ మరింత ఎక్కవగా సాగుతోంది.

అయితే టీడీపీతో పొత్తుపై తుది నిర్ణయం తీసుకోవాల్సింది కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీనే కాబట్టి ఏపీ హస్తం ముఖ్య నేతలు పొత్తుపై ఆచితూచి మాట్లాడుతున్నారు. టీడీపీతో పొత్తు ఉంటుందా లేదా అనే అంశం ముఖ్యం కాదని రాహుల్ దేశ ప్రథాని కావడమే లక్ష్యమని చెప్పుకొస్తున్నారు. ఇదే విషయాన్ని రెండ్రోజుల క్రితం కాకినాడ వచ్చిన ఏపీ కాంగ్రెస్ అగ్ర నేతలు స్పష్టం చేశారు. టీడీపీతో పొత్తుపై ఏపీ కాంగ్రెస్ నేతలు అభిప్రాయాలు సేకరించి హై కమాండ్‌ కు పంపుతున్నామని చెబుతున్నా దోస్తీ తప్పదనే దిశగానే పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories