Top
logo

టాటా బోయింగ్ ఏరోస్పేస్ కంపెనీ ప్రారంభం

టాటా బోయింగ్ ఏరోస్పేస్ కంపెనీ ప్రారంభం
X
Highlights

రంగారెడ్డి జిల్లా ఆదిభట్లలో టాటా బోయింగ్ ఎరోస్పెస్ కంపెనీని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. 13 ఎకరాల...

రంగారెడ్డి జిల్లా ఆదిభట్లలో టాటా బోయింగ్ ఎరోస్పెస్ కంపెనీని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. 13 ఎకరాల విస్తీర్ణంలో 200కోట్లతో ఈ ఏరోస్పెస్ సెంటర్ ను నిర్మించారు. బోయింగ్ విడిభాగాలు, అపాచీ హెలికాఫ్టర్ల తయారీ చేయనున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి నిర్మలాసీతరామన్, రతన్ టాటాతో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర మౌలిక సదుపాయాల సంస్థ (టీఎస్‌ఐఐసీ) వైమానిక సెజ్‌లో విమాన విభాగాల తయారీ కేంద్రానికి 2016 జూన్ 18న అప్పటి రక్షణశాఖ మంత్రి మనోహర్ పారికర్, టాటా గ్రూపుల చైర్మన్ రతన్ టాటా, తెలంగాణ మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లిమిటెడ్, బోయింగ్ సంస్థలు కలిసి టాటా బోయింగ్ ఏరో స్పేస్ లిమిటెడ్ ఉమ్మడి సంస్థను ఏర్పాటుచేశాయి. దీని ఆధ్వర్యంలో మైమానిక సెజ్‌లో 13 ఎకరాల్లో రూ.200 కోట్లతో పరిశ్రమను నిర్మించాయి. బోయింగ్ ఏహెచ్ 64 విమానాల విడిభాగాలకుతోడు అపాచీ హెలికాప్టర్లను ఇందులో తయారుచేయనున్నారు. వీటికి అమెరికా సహా 15 దేశాల్లో బాగా డిమాండ్ ఉంది.

Next Story