తనికెళ్ళ భరణి గారు తెలుగుతల్లి యొక్క ఒక ఆభరణం.

తనికెళ్ళ భరణి గారు తెలుగుతల్లి యొక్క ఒక ఆభరణం.
x
Highlights

శివ సినిమా మీరు చూసి వుంటే....ఒక పాత్ర ని ఎప్పటికి మీరు మరవలేరు...అదేనండి ...మన తనికెళ్ళ భరణి పాత్ర. తనికెళ్ళ భరణిగారు రంగస్థల, సినిమా రచయిత, నటుడు....

శివ సినిమా మీరు చూసి వుంటే....ఒక పాత్ర ని ఎప్పటికి మీరు మరవలేరు...అదేనండి ...మన తనికెళ్ళ భరణి పాత్ర. తనికెళ్ళ భరణిగారు రంగస్థల, సినిమా రచయిత, నటుడు. తెలుగు భాషాభిమాని. భరణి స్వస్థలం పశ్చిమ గోదావరిజిల్లా, పోడూరు మండలంలోని జగన్నాధపురం. తెలుగు సినిమాలలో హాస్య ప్రధాన పాత్రలు అనేకం పోషించాడు. ఈయన సకల కళాకోవిదుడు. ఇతనికి ప్రముఖ దర్శకుడు వంశీ మిత్రుడు. వంశీ దర్శకత్వంలో వచ్చిన శ్రీ కనక మహాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూప్ సినిమాకు మంచి సంభాషణలు అందివ్వడమే కాక ఒక మంచి పాత్రను కూడా పోషించాడు. ఇప్పటిదాకా దాదాపు 320 సినిమాలలో నటించాడు. తనికెళ్ళ భరణి ఇంటర్ వరకు ఏమీ వ్రాయలేదుట. ఇంటర్ చదివేసమయంలో ఆయన మిత్రుడు శ్రేయోభిలాషి అయిన దేవరకొండ నరసింహ ప్రసాద్ ప్రేరణతో వ్రాసిన " అగ్గిపుల్ల ఆత్మహత్య ", " కొత్త కలాలు " కవితలు ఆంధ్రజ్యోతి పత్రికలో ప్రచురితమైంది. తరువాత బి.కాం చదివే సమయంలో రాళ్ళపల్లితో పరిచయం అయింది. రాళ్ళపల్లి వ్రాసిన " ముగింపు లేని కథ " నాటకంలో తనికెళ్ళ భరణి 70 సంవత్సరాల వయోధిక పాత్ర ధరించాడు. ఆ నాటకం విజయం సాధించిన తరువాత భరణికి నాటకరంగంలో స్థిరమైన స్థానం లభించింది. అప్పటినుండి నుండి ఇప్పటివరకు మన భరణి గారి ప్రయాణం గొప్పగా సాగుతూనేవుంది. శ్రీ.కో.

Show Full Article
Print Article
Next Story
More Stories