నివురుగప్పిన నిప్పులా తూత్తుకుడి..

నివురుగప్పిన నిప్పులా తూత్తుకుడి..
x
Highlights

తూత్తుకూడిలో జరిగిన హింసాత్మక సంఘటనపై జాతీయ మానవ హక్కుల సంఘం స్పందించింది. తమిళనాడు ప్రభుత్వానికి నోటీసు జారీ చేసింది. తమిళనాడు చీఫ్ సెక్రటరీ గిరిజా...

తూత్తుకూడిలో జరిగిన హింసాత్మక సంఘటనపై జాతీయ మానవ హక్కుల సంఘం స్పందించింది. తమిళనాడు ప్రభుత్వానికి నోటీసు జారీ చేసింది. తమిళనాడు చీఫ్ సెక్రటరీ గిరిజా వైద్యనాథన్, డిజిపి టికె రాజేంద్రన్ లకు నోటీసులు జారీ చేసింది. ఈ ఘటనపై 2 వారాల్లోగా పూర్తి వివరాలు అందించాలని ఆదేశించింది. ఘటనలో గాయపడిన వారికి ఏ విధమైన చికిత్స అందిస్తున్నారనే విషయం కూడా తెలిపాలని మానవ హక్కుల సంఘం ఆదేశించింది. హింసాత్మక సంఘటనలు జరుగుతాయనే విషయాన్ని అధికారులు ముందుగా అంచనావేయలేకపోయారని మానవ హక్కుల సంఘం పేర్కొంది.

స్టెరిలైట్ కంపెనీపై తమిళనాడు పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ చర్యలకు దిగింది. తూత్తుకూడిలో ప్లాంట్ ను మూసివేయాలని ఆదేశించింది. పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ చైర్మన్ ఈ ఆదేశాలు జారీ చేశారు. చైర్మన్ ఆదేశాలకు అనుగుణంగా ఆ శాఖ అధికారులు కాపర్ స్మెల్టర్ ప్లాంట్ కు విద్యుత్ నిలిపివేశారు. గురువారం ఉదయం 5.15 నిమిషాలకు విద్యుత్ ను నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. మే 18, 19 తేదీల్లో కాలుష్య నియంత్ర ణ బోర్డ్ అధికారులు స్టెరిలైట్ కంపెనీ లో సోదాలు చేపట్టారు. కంపెనీ విస్తరణ కార్యక్రమాలను చేపడుతుందని గ్రహించారు. దీంతో తిరునల్వేలి జాయింట్ చీఫ్ ఇంజనీర్ ప్లాంట్ కు విద్యుత్ ను నిలిపివేయాలని సూచించారు. చీఫ్ ఇంజనీర్ సూచనలకు అనుగుణంగా కాలుష్య నియంత్రణ బోర్డ్ చైర్మన్ ప్లాంట్ ను మూసివేయాలని ఆదేశించారు.

తూత్తుకోడి స్టెరిలైట్ ప్లాంట్ వ్యతిరేక ఆందోళనల్లో ఇప్పటి వరకు 13 మంది చనిపోయారు. తమిళనాడు ప్రభుత్వం నిద్రమత్తు వీడింది. తూత్తుకూడి, తిరునల్వేలి, కన్యాకుమారి జిల్లాల్లో 5 రోజుల పాటు ఇంటర్నెట్ సేవలను నిలిపివేయాలని ఆదేశించింది. అసాంఘిక శక్తులు సోషల్ మీడియాలో రెచ్చగొట్టే వ్యాఖ్యలను వ్యాప్తి చేయకుండా ఉండేందుకు ఈ చర్య తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. కీలక అధికారులను బదిలీ చేశారు. తూత్తుకూడి కలెక్టర్ ఎన్. వెంకటేశ‌్ ను బదిలీ చేశారు. ఆయన స్థానంలో తిరునల్వేలి కలెక్టర్ గా ఉన్న సందీప్ నందూరిని నియమించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories