మొన్న బెల్లి డ్యాన్స్‌.. నిన్న తల్వార్‌ డ్యాన్స్‌

x
Highlights

హైదరాబాద్‌ పాతబస్తీలో తల్వార్ల డ్యాన్స్‌ కలకలం రేపుతోంది. చంద్రాయణగుట్టలో ఓ పెళ్లి వేడుకలో యువకులు తల్వార్లతో చిందులేశారు. రోడ్లపై తల్వార్లతో...

హైదరాబాద్‌ పాతబస్తీలో తల్వార్ల డ్యాన్స్‌ కలకలం రేపుతోంది. చంద్రాయణగుట్టలో ఓ పెళ్లి వేడుకలో యువకులు తల్వార్లతో చిందులేశారు. రోడ్లపై తల్వార్లతో డ్యాన్సులు వేస్తున్నా పోలీసులు పట్టించుకోలేదు. వారం రోజుల క్రితం ఇదే ప్రాంతంలో బెల్లి డ్యాన్సులు నిర్వహించారు. తాజాగా ఇప్పుడు తల్వార్లతో ప్రమాదకర డ్యాన్సులు చేస్తున్నా పోలీసులు పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. చాంద్రాయణగుట్టలోని బండ్లగూడలోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో శనివారం జరిగిన పెళ్లి వేడుకలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఫంక్షన్‌ హాల్‌ వెలుపల మెయిన్‌ రోడ్‌పై మూడు గంటలపాటు తల్వార్‌ డ్యాన్స్‌లు చేశారు. ఇది చూసిన సామాన్య ప్రజలు హడలిపోయారు. ఇంత జరుగుతున్నా పోలీసులు మాత్రం ప్రేక్షక పాత్ర పోషించారు. ఇది జరిగి 48 గంటలు గడిచిన ఇప్పటివరకు దీనికి కారణమైన వారిపై పోలీసు శాఖ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. తమ ప్రాంతంలో ఇలాంటి కార్యకలపాలు చోటుచేసుకోవడంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories