అలర్ట్ అయిన కాంగ్రెస్... ముఖేష్ గౌడ్ ఇంట్లో నేతల భేటీ, జానారెడ్డి గైర్హాజరు!

x
Highlights

తెలంగాణ అసెంబ్లీ రద్దుకు ముహూర్తం ఖరారైందనే ఊహగానాల నేపధ్యంలో కాంగ్రెస్ నేతలు భవిష్యత్ పరిణామాలపై దృష్టి సారించారు. ముందస్తు ఎన్నికలు, అసెంబ్లీ...

తెలంగాణ అసెంబ్లీ రద్దుకు ముహూర్తం ఖరారైందనే ఊహగానాల నేపధ్యంలో కాంగ్రెస్ నేతలు భవిష్యత్ పరిణామాలపై దృష్టి సారించారు. ముందస్తు ఎన్నికలు, అసెంబ్లీ రద్దుపై అనుసరించాల్సిన వ్యూహాలపై కాంగ్రెస్ నేతలు చర్చించనున్నారు. మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ నివాసంలో సాయంత్రం ఐదు గంటలకు కాంగ్రెస్ నేతలు సమావేశం కానున్నారు. పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డితో పాటు సీనియర్ నేతలు డీకే అరుణ, కోమటిరెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, షబ్బీర్ అలీ, రేవంత్ రెడ్డి ఈ సమావేశానికి హాజరుకానున్నారు. ముఖేష్ గౌడ్ పార్టీ మారుతారంటూ జోరుగా ప్రచారం జరుగుతున్న సమయంలో ఆయన నివాసంలోనే చర్చ జరగడం ఆసక్తిగా మారింది. కంటికి ఆపరేషన్ చేయించుకోవడంతో జానారెడ్డి ఈ సమావేశానికి దూరంగా ఉన్నట్టు సమాచారం.

Show Full Article
Print Article
Next Story
More Stories