కీలక నిర్ణయాలు తీసుకున్న టీకాంగ్రెస్ ఎన్నికల కమిటీ...వారికి నో టికెట్స్‌....

కీలక నిర్ణయాలు తీసుకున్న టీకాంగ్రెస్ ఎన్నికల కమిటీ...వారికి నో టికెట్స్‌....
x
Highlights

తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల కమిటీ... పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈనెల 9లోగా మిత్రపక్షాలతో సీట్ల సర్దుబాటు పూర్తి చేసుకొని, ఈనెల 14నాటికి అభ్యర్ధులను...

తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల కమిటీ... పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈనెల 9లోగా మిత్రపక్షాలతో సీట్ల సర్దుబాటు పూర్తి చేసుకొని, ఈనెల 14నాటికి అభ్యర్ధులను ప్రకటించాలని టార్గెట్‌గా పెట్టుకుంది. అయితే గత ఎన్నికల్లో డిపాజిట్‌ కోల్పోయినవారికి, రెండుసార్లు ఓడినవారికి టికెట్లు ఇవ్వకూడదని నిర్ణయం తీసుకున్నారు. విశ్వసనీయత, గెలుపు ప్రామాణికంగా అభ్యర్థులను ఎంపిక చేయాలని తీర్మానం చేశారు. అలాగే గెలిచే స్థానాలను మిత్రపక్షాలను వదులుకోకూడదని నిర్ణయం తీసుకున్నారు. ఒక కుటుంబానికి ఒకే టికెట్‌ ఇచ్చేలా ఏఐసీసీ విధాన నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో కొత్తగా వారసత్వ ప్రయోగాలు చేయవద్దని టీపీసీసీ వ్యూహ, ప్రణాళికా కమిటీ సూచించింది. గతంలో ఒకే కుటుంబం నుంచి ఇద్దరు ప్రాతినిథ్యం వహించిన వారికి ఇప్పుడూ మినహాయింపు ఇ చ్చారు. కమిటీ చైర్మన్‌ వి.హన్మంతరావు మాట్లాడుతూ గెలిచేస్థానాలను వదులుకోవద్దని సూచించినట్లు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories